తండ్రి కాళ్లు విరగ్గొట్టిన కూతురు.. ఎందుకో తెలుసా?
అయితే అలాంటి డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ఇటీవల చేసిన పని కాస్త ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉంది. ఏకంగా గారాబంగా కనీ పెంచిన తండ్రి విషయంలో కాస్త అయినా జాలి దయ చూపించలేకపోయింది ఆ కూతురు. ఏకంగా ప్రియుడి మోసులో పడి తండ్రి కాళ్లు విరగొట్టింది ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మదా తాలూకాలో వెలుగులోకి వచ్చింది మహేంద్ర షా అనే వ్యక్తి పేరు మోసిన వ్యాపారవేత్త. అతనికి సాక్షి అనే కుమార్తె ఉంది ఇటీవల చైతన్య అనే యువకుడుని ప్రేమించింది ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. అయితే దీనికి తండ్రి అడ్డుగా ఉన్నాడని ఆ యువతీ భావించింది
ఈ క్రమంలోనే చిన్నప్పటినుంచి ఎంతో గారాబంగా పెంచిన తండ్రి కాళ్లు విరగొట్టాలని ఆ కూతురు నిర్ణయించుకుంది. ఇక నలుగురు వ్యక్తులకు 60 వేల రూపాయల సుపారి ఇచ్చి మరి పథకం ప్రకారం దారుణానికి పాల్పడింది. పూణేకి వెళ్ళిన సాక్షి ఇక తిరిగి ఇంటికి వచ్చింది అయితే బస్సు దిగి రమ్మని ఫోన్ చేసింది. కుమార్తెను ఇంటికి తీసుకువెళ్లేందుకు మహేంద్ర కారులో వచ్చాడు. తిరిగి వెళుతుండగా ఓ గ్రామం సమీపంలో మూత్రం వస్తుందని సాక్షి కార్ ఆపింది. వెంటనే రెండు బైకులపై కారును అనుసరిస్తున్న నలుగురు వ్యక్తులు మహేంద్ర పై దాడి చేసే దారుణంగా కొట్టి.. ఆయన రెండు కాళ్లు విరగొట్టారు. పదునైన ఆయుధాలతో తలపై పొడిచి పారిపోయారు. మహేంద్ర అరుపులు విన్న స్థానికులు అక్కడికి వచ్చి అతని ఆసుపత్రిలో చేర్పించారు ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనగా మారిపోయింది.