చెల్లెలి ప్రియుడ్ని సుత్తితో కొట్టి చంపిన అన్నలు.. థానే లో దారుణం?
తమ చెల్లెల్ని బాధపెడుతున్న షెబాజ్ షేక్ ను చంపాలని నిర్ణయించుకున్నారు షోయబ్ షేక్, ఇర్షాద్ షేక్. దీనికోసం మరో వ్యక్తి సహాయం కూడా తీసుకున్నారు. ఒక రిక్షాలో ఎవరు లేని ప్రదేశానికి తీసుకువెళ్లారు. షాబాజ్ ను సుత్తితో తలపై బలంగా కొట్టి చంపేశారు. తరువాత సాక్ష్యం లేకుండా చేసే ఉద్దెశంతో సేవాణ్ని ఉల్హాస్ నదిలో పారేసారు. ప్రస్తుతం పోలీసులు షాబాజ్ సేవాణ్ని వెతుకుతున్నారు. పోలీసులు ముగ్గురు నిందితుల్ని బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
షాబాజ్ ఉన్నట్టుండి కనపడకపోయేసరికి అతని తండ్రి శుక్రవారం ఖాదక్పరా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఆయన కంప్లైంట్ ప్రకారం సబ్-ఇన్స్పెక్టర్ సర్జేరావు పాటిల్ విచారణ మొదలుపెట్టారు. ముంతాజ్ ను, ఆమె అన్నలను విచారించారు. విచారణలో ఆమె అన్నలు నిజం ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు షోయబ్ షేక్, ఇర్షాద్ షేక్ లతో పాటు వారికి సహాయం చేసిన హేమంత్ బీచువాడే అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసారు. పలు సెక్షనల్ కింద వారిపై కేసు నమోదు చేసారు. ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు పోలీసులు.