పందెంకోడిని కొనేందుకు.. థాయిలాండ్ నుంచి వచ్చిన యువత.. కానీ?
అయితే ఇలాంటి తరహా వీడియోలతో కొంతమంది సోషల్ మీడియా జనాలు కూడా బాగా ప్రభావితం అవుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి వ్యక్తుల గురించే. సాధారణంగా సోషల్ మీడియాలో కోళ్ల పందాలకు సంబంధించిన వీడియోలు చాలానే ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఇక ఇలాంటి వీడియోలు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. రెండు పందెం కోళ్ళు హోరాహోరీగా పోట్లాడుకుంటుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అని చెప్పాలి. అయితే ఉభయగోదావరి జిల్లాలో కోళ్ల పందాలు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా లక్షల రూపాయలు ఈ కోళ్ల పందాలలో చేతులు మారుతూ ఉంటాయి.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది భోగి పండక్కి పశ్చిమగోదావరి జిల్లాలోని ఘనప వరంలో జరిగిన కోళ్ల పందాలలో ఒక కోడి ఏకంగా 27 లక్షల పందెం గెలిచింది. ఈ క్రమంలోనే ఈ కోడి పందానికి సంబంధించిన వీడియో ని సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ వీడియో థాయిలాండ్ నెటిజెన్స్ దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే థాయిలాండ్ యువతీ యువకులు ఏకంగా ఆ దేశం నుంచి ఇండియాకి ఆ పందెంకోడిని కొనడానికి వచ్చారు. ఇక ఏలూరు జిల్లా రంగాపురంకు చెందిన రత్తయ్య దగ్గర మూడు లక్షలు వెచ్చించి మరి ఆ పందెంకోడిని కొనుగోలు చేయాలి అనుకున్నారు. కానీ రత్తయ్య అందుకు నిరాకరించగా ఇక ఆ కోడితో ఫోటో దిగి మరో పుంజును మూడు లక్షలతో కొనుక్కుని వెళ్ళిపోయారు.