ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన భార్య.. ఇంకా రివర్స్ లో దాడి?
అయినా ఆ ప్రేమికులు వెనక్కి తగ్గలేదు. ఏకంగా పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు. అయితే పెళ్లి అయిన తర్వాత మాత్రం భార్య తన దుర్బుద్ధి బయట పెట్టింది. మరొకరితో వివాహేతర సంబంధానికి తెరలేపింది. క్రమ క్రమంగా భర్తను దూరం పెట్టడం మొదలుపెట్టింది. దీంతో అనుమానం కలిగిన భర్త భార్యపై ఒక కన్నేసాడు. ఎట్టకేలకు అతని అనుమానమే నిజమైంది. ఢిల్లీ మెట్రో స్టేషన్లో అతను తన భార్యను ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. అయితే ఇలా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సమయంలో ఎవరైనా సరే అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం అలా చేయలేదు ఏకంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త పైనే దాడికి దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది.
ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారింది అని చెప్పాలి. ఢిల్లీకి చెందిన ఒక జంట ఇలా పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుని ఒక్కటైంది. అయితే వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. కానీ తర్వాత అసలు సమస్య మొదలైంది. భార్య తన భర్తను దూరం పెట్టి వేరొకరి మోజులో పడిపోయింది. ఈ క్రమంలోనే అనుమానం వచ్చిన భర్త భార్యపై కన్నేసి ఉంచాడు. ఓ రోజు ఆమెను ఫాలో అయ్యాడు. మొత్తానికి అతని అనుమానం నిజమైంది. ఢిల్లీ మెట్రో స్టేషన్ లో ఏకంగా ప్రియుడు చేతి పట్టుకుని వయ్యారంగా నడుస్తూ కనిపించింది భార్య. దీంతో అతని చేతిలో ఉన్న ఫోన్లో ఇదంతా రికార్డ్ చేశాడు చివరికి భార్య దగ్గరికి చేరుకొని నిలదీసాడు. అయితే విడాకులు తీసుకుందాం అంటూ చెప్పడంతో కోపంతో ఊగిపోయిన భార్య.. అతనిపై దాడి చేసి విడాకులు కావాలి అంటూ తెగేసి చెప్పింది.