బట్టలు విప్పాలన్న ప్రొఫెసర్.. అమ్మాయిలు ఏం చేశారో తెలుసా?

praveen
ఆడపిల్ల జీవితం రోజు రోజుకీ దుర్భరం గా మారి పోతుందా అంటే నేటి రోజుల్లో వెలుగు లోకి వచ్చిన ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అవును అని సమాధానం చెబుతున్నారు. ఎందుకంటే ఇంట్లో ఉన్న బయటికి వెళ్లిన.. స్కూల్ కు వెళ్లిన.. కాలేజీకి వెళ్లిన ఇలా ఎక్కడికి వెళ్లినా కూడా ఆడపిల్లలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. మంచి వాళ్ళ ముసుగు వేసుకుంటున్న ఎంతో మంది కామందులు సమయం సందర్భం చూసి చివరికి వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 ఈ ఘటనలు ఆడపిల్ల జీవితం రోజురోజుకీ ఎంత ప్రశ్నార్థకం గా మారి పోతుంది అన్న దానికి నిదర్శనంగా మారి పోతున్నాయి అని చెప్పాలి. దీంతో ఇక ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్న ఆడపిల్లలు మేము ఆడపిల్లగా పుట్టడమే చేసిన పాపమా అనే బాధపడుతున్న దుస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యం గా మహిళా సాధికారతను సాధించే దిశగా ఎంతో మంది అమ్మాయిలు ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. కానీ అక్కడ కొంత మంది గురువులు దారుణం గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏకంగా తమ దగ్గర చదువుకుంటున్న పిల్లలను సొంత బిడ్డల్లాగా భావించడం మానేసి.. వేధింపులకు పాల్పడుతున్నారు. అయితే ఇది కేవలం మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ కొనసాగుతుంది అని చెప్పాలి.


 ఇక్కడ వైద్య విద్యార్థునులపై ఒక ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తించాడు. బోధనలో భాగంగా శరీర భాగాలు గుర్తించి వివరించడానికి.. దుస్తులు విప్పి నిలబడాలి అంటూ ఆదేశించాడు. దీంతో ఇక విసిగి పోయిన విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. యూఎస్ లోని ఓ కాలేజీలో ఈ ఘటన జరిగింది. దీనిపై ప్రత్యేక విభాగంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే వేధింపులకు పాల్పడినట్లు విచారణలు తేలడంతో ఇక పాఠశాల యాజమాన్యం సదరు ప్రొఫెసర్ ను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: