బాలికపై 68 ఏళ్ళ వృద్ధుడు అత్యాచారం.. కొడుకు ఫోన్ లో వీడియో రికార్డు?

praveen
ఇటీవల కాలంలో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇలాంటి ఘటనల గురించి తెలిసిన తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులు ప్రతిక్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ బిడ్డ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందా లేదా అని అనుక్షణం భయపడిపోతున్నారు. అయితే ఆడపిల్లలపై వేధింపులకు పాల్పడిన వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాలు తీసుకువచ్చినప్పటికీ అటు కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఇక ఆడపిల్లలపై అత్యాచారం చేసి జీవితాన్ని నాశనం చేస్తున్న నీచులు ఈ సభ్య సమాజంలో ఎక్కువగా కనిపిస్తున్నారు.


 ఇక ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా పదహారేళ్ల బాలికపై 68 ఏళ్ళు వృద్ధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే ఇదంతా 40 ఏళ్ల కుమారుడు  ఫోన్లో రికార్డు అవ్వడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రితో విభేదాలు ఉండడంతో అతను చేతబడి చేస్తున్నాడు అని అనుమానంతో రహస్యంగా ఇంట్లో ఒక ఫోన్ అమరచాడు.అయితే ఇక అందులో అతని తండ్రి వికృత దృశ్యాలు అన్నీ కూడా రికార్డు అయ్యాయి.



 అయితే ఇటీవలే నిందితుడు కొడుకు ఈ వీడియోని బాధితురాలి తండ్రికి చూపించడంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి కొడుకులు ఇద్దరినీ కూడా అరెస్టు చేసి విచారిస్తున్నారు అని చెప్పాలి. బాలిక నివసిస్తున్న ఇంటి పరుగున ఆ వృద్ధుడు  ఉంటాడని.. ఎప్పుడు తమ ఇంటికి రావడం.. ఆధ్యాత్మిక యాత్రలకు సైతం తమతో కలిసి వస్తుంటాడని బాలిక తండ్రి పోలీసులకు తెలిపాడు. అయితే ఈ ఘటన జరిగిన రోజు ఇంటి బయట ఒంటరిగా ఉన్న తనకు ఏదో మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకువెళ్లాడని బాలిక పోలీసులకు చెప్పింది. ఆ తర్వాత ఇంట్లో ఒక గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఇక పోలీసుల ముందు జరిగిన విషయాన్ని వివరించింది బాలిక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: