నడి రోడ్డుపైనే.. ఎంత దారుణంగా నరికాడో చూడండి?
అయితే ఒక అయ్య చేతిలో పెట్టి పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన అక్కడ గృహహింస కు గురవుతున్నారు మహిళలు. ఇలా నిత్యం ఎక్కడో చోట మహిళలు వేధింపులకు గురవుతూ దుర్బర జీవితాన్ని గడుపుతూనే ఉన్నారు. ఇక ఇటీవల మహారాష్ట్రలో అయితే పట్టపగలే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రేమను ఒప్పుకోలేదు అన్న కారణంతో ఒక యువతిని దారుణంగా నడిరోడ్డుపై వెంబడించి మరి హత్య చేయబోయాడు యువకుడు. పూణేలోని సదాశివ్ పేటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది.
ఈ వీడియోలో చూసుకుంటే రద్దీగా ఉన్న రోడ్డు మీద టూ వీలర్ పై వెళ్తుంది 20 ఏళ్ల యువతి. అయితే ఆకస్మాత్తుగా అక్కడికి వచ్చిన యువకుడు చేతిలో కత్తి పట్టుకుని ఆ యువతీని అడ్డగించాడు. వెంటనే తన వద్ద ఉన్న పదునైన కత్తితో యువతపై దాడికి యత్నించాడు. అయితే అతడి భారీ నుంచి తప్పించుకునేందుకు స్కూటీ వదిలేసి యువతి వీధుల్లో పరిగెత్తింది. యువకుడు కూడా ఆమెపై దాడి చేసేందుకు చేతిలో కత్తితో ఆమె వెంటే పరిగెత్తాడు. ఈ క్రమంలోనే వీపుపై దాడి చేయడంతో ఆమె కింద పడిపోయింది. మళ్ళీ లేచి పరిగెత్తుతుండగా ఆమెపై దాడి చేస్తూనే ఉన్నాడు. ఇంతలో రోడ్డు పక్కన వెళ్తున్న కొంతమంది అతని ఆపేందుకు ప్రయత్నించగా.. ఇక వారిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించాడు. చివరికి ఎంతో ధైర్యం చేసి అతని పట్టుకొని పోలీసులకు అప్పగించారుస్థానికులు. ఇక గాయాలపాలైన యువతిని ఆస్పత్రికి తరలించారు.