భార్యపై అనుమానం.. భర్త ఎంతకు తెగించాడంటే?

praveen
ఒకసారి పెళ్లి అనే బంధంతో దాంపత్య బంధం లోకి అడుగు పెట్టిన తర్వాత ఒకరిపై ఒకరు అపారమైన నమ్మకం పెట్టుకోవాలి. ఎందుకంటే అలా భార్యా భర్తల మధ్య నమ్మకం ఉన్నప్పుడే ఇక వారి సంసార జీవితం ఎంతో సాఫీగా సాగి పోతూ ఉంటుంది. కానీ ఒకరిపై ఒకరికి నమ్మకం లేనప్పుడు.. ఎన్నో మధురాను భూతులను మిగిల్చే సంసార జీవితం అటు నరకప్రాయం గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. దీంతో కష్టసుఖాల్లో తోడుంటారు అనుకున్న కట్టుకున్న వారే బద్ద శత్రువులుగా మారిపోతూ ఉంటారు. చివరికి ప్రాణాలు తీసే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది.


 అయితే ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య ఇలాంటి అన్యోన్యత మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. చిన్నచిన్న కారణాలపై ఒకరిపై ఒకరు పగ పెంచుకుంటూ దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇక భార్య భర్తపై.. భర్త భార్యపై అనుమాన పడుతూ చివరికి సూటి పోటి మాటలతో చిన్నచిన్న గొడవలు పెద్దదిగా మార్చుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇటీవల హైదరాబాద్ నగరంలోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ దారుణ హత్య అందరిని ఉలిక్కిపడేలా చేసింది. మిరాజ్ అలీ అనే 40 ఏళ్ల వ్యక్తి తన భార్య ఫాతిమాను దారుణంగా చంపేశాడు.


 ఈ ఘటన సంచలనంగా మారగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలోనే ఎన్నో షాకింగ్ నిజాలు కూడా విచారణలో బయటపడ్డాయి. భార్యపై అనుమానంతో మీరాజ్ అలీ గత కొన్ని రోజులుగా ఇక ఇంట్లో భార్యతో గొడవలు పడుతున్నట్లు స్థానికులు కూడా చెప్పారు. అయితే ఇక భర్త ఈ అనుమానంతోనే భార్య తలపైరాడ్డుతో కొట్టి చంపాడు. కాగా ఈ దంపతులకు ముగ్గురు పిల్లలుఉన్నారు. మిరాజ్ అలీ చేసిన పనికి ఆ ముగ్గురు పిల్లలు కూడా తల్లి లేని వారిగా మారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: