ఆన్లైన్లో వినోదం పంచిన గేమ్.. చివరికి ప్రాణం తీసింది?
ఏంటో ఇక ఈ ఆన్లైన్ మాయ లో పడి పోయి పక్కనే ఉన్న మనుషులను పట్టించు కోవడం మానేసి.. ఎక్కడో ఉన్న మనుషుల తో సెల్ఫోన్లో మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు జనాలు. అయితే కేవలం చాటింగ్ మీటింగ్ విషయంలోనే కాదు ఇక గేమ్స్ ఆడటం విషయంలోనూ పూర్తిగా మార్పు వచ్చింది. ఒకప్పుడు ఖాళీ సమయం దొరికితే మైదానంలోకి వెళ్లి స్నేహితులతో గేమ్స్ ఆడేవారు. కానీ ఇప్పుడు అదే స్నేహితులతో అటు ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ అసలు క్రీడలను మరచిపోతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆన్లైన్ గేమ్స్ బాగా అలవాటు పడిపోతున్నారు. దీంతో ఆన్లైన్ గేమ్స్ కారణంగా భారీగా డబ్బులు కోల్పోతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది.
చివరికి ఆన్లైన్ గేమ్స్ కి బానిసలుగా మారిపోయి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. వరంగల్ జిల్లాలో ఇలాంటి విషాదకరకటన చోటుచేసుకుంది. నెక్కొండ మండలంలోని అప్పలరావుపేటలో ఉదయ్ అనే యువకుడు ఆన్లైన్ గేమ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల ఆన్లైన్ రమ్మీ ఆడి 40,000 పోగొట్టుకున్నాడు. అయితే ఇంట్లో వాళ్ళు ఏమంటారో అని అతను భయపడ్డాడు. దీంతో కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.