తండ్రిని చంపిన కొడుకు.. సహకరించిన తల్లి.. కారణమేంటంటే?
ఒకప్పుడు పక్క వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. మనం మన కుటుంబం బాగుంటే చాలు అని కాస్త స్వార్థంతోనే ఆలోచించేవాడు మనిషి. కానీ నేటి రోజుల్లో మన కుటుంబీకులు ఏమైపోయినా పర్వాలేదు. నేను బాగుంటే చాలు అని మరింత స్వార్థంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇలా నేను అనే స్వార్థం మనిషితో ఎన్నో దారుణాలకు పాల్పడే విధంగా చేస్తుంది అని చెప్పాలి. దీంతో ఇక సొంత వారి విషయంలో కాస్తయినా జాలీ దయ చూపించకుండా దారుణంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది.
బూర్గంపహాడ్ మండలం సారా సాకలో రక్తం పంచుకుని పుట్టిన కొడుకు తండ్రిని దారుణంగా హత్య చేశాడు. కారు కొనేందుకు డబ్బు ఇవ్వలేదని కోపం పెంచుకున్న కొడుకు నిద్రపోతున్న తండ్రి జాఫర్ ను సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హత్యకు తల్లి కూడా సహకరించినట్లు విచారణలో తేల్చారు. అయితే ఇటీవలే పెద్దలు తరఫున ఆస్తి జాఫర్కు రావడంతో డబ్బులు ఇవ్వాలని కొడుకును అడిగాడు. తండ్రి ఇవ్వకపోవడంతోనే ఇలాంటి దారుణానికి పాల్పడినట్లు తేలింది.