అదనపు కట్నం వేధింపులు.. కోర్టు ఏం శిక్ష వేసిందో తెలుసా?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లి గురించి కోటి ఆశలు పెట్టుకుంటుంది. నచ్చిన వరుడుని తన జీవితంలోకి ఆహ్వానించి పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడని.. కోటి ఆశలు పెట్టుకుంటుంది. కానీ ఇటీవల కాలంలో మాత్రం పెళ్లి అనేది ఎంతో మంది అమ్మాయిల విషయంలో నరకప్రాయంగా మారిపోతుంది అని చెప్పాలి. ఎందుకంటే పెళ్లి సమయంలో ఇక భారీగా కట్న కాలుకలు ముట్టజెప్పి పెళ్లి తంతు జరిపించిన ఆ తర్వాత.. కొన్నాళ్ళకి అదనపు కట్నం కోసం వేధిస్తున్న అత్తమామలు భర్తలు ఎక్కువగా కనిపిస్తున్నారు నేటి రోజుల్లో.

 వెరసి కోటి ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకున్న అమ్మాయిలకు.. ఇక అదనపు కట్నం వేధింపులతో నరకం చూస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల ఇలాంటి తరహా ఘటనే జరిగింది. గద్వాల పట్టణానికి చెందిన ఉషారాణికి  రంగారెడ్డి జిల్లా నాచారం కు చెందిన శరత్ కుమార్ గౌడ్తో పెళ్లి జరిగింది. ఈ క్రమంలోనే ఎనిమిది లక్షలు, ఇరవై తొలాల బంగారం ఇతర వస్తువులు కట్నంగా ఇచ్చారు. అయితే పెళ్లయిన మూడు నెలల వరకు అంత సవ్యంగానే ఉంది. కానీ తర్వాత భర్త అత్తమామలు మరో ఐదు లక్షల కట్నం తీసుకురావాలని ఉషారాణిని వేధించడం మొదలుపెట్టారు.

 విడాకులు ఇస్తాను అంటూ నోటీసు కూడా పంపించారు. ఈ క్రమంలోనే కొన్నాళ్లపాటు అత్తమామలు భర్త వేధింపులు భరించిన ఉషారాణి ఆ తర్వాత ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. ఉషారాణిని అత్తింటి వారు మానసికంగా శారీరకంగా వేధించినట్లు విచారణలో రుజువు కావడంతో అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలోనే కోర్టు విచారణలో భాగంగా అతనికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయలు జరిమాన విధిస్తూ తీర్పును వెలువరించారు జడ్జి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: