క్రికెట్ లో గొడవ.. చివరికి ప్రాణం తీసేసాడు?

praveen
క్రికెట్ అనేది ఇండియాలో జాతీయ క్రీడ కాదు . కానీ జాతీయ క్రీడ హాకీ కి ఉన్న పాపులారిటీ కంటే అటు క్రికెట్ కి ఎక్కువ పాపులారిటీ ఉంది అని చెప్పాలి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆటను ఇష్టపడుతూ ఉంటారు. అయితే అటు పెద్ద పెద్ద మైదానంలో వచ్చే అంతర్జాతీయ మ్యాచ్లను చూడటమే కాదు.. కాస్త ఖాళీ సమయం దొరికిందంటే చాలు బాలు బ్యాడ్ పట్టుకొని ఇక మైదానంలో క్రికెట్ ఆడటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా గల్లీ క్రికెట్ ఆడి క్రికెట్ ను మరింత ఆస్వాదిస్తూ ఉంటారు.

 ఇక మరికొంతమంది క్రికెట్ ఆడటానికి కాస్త దూరంగా ఉన్నప్పటికీ టీవీలో వచ్చే మ్యాచ్లను చూసి మాత్రం తెగ సంబరపడిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇలా క్రికెట్ ప్రతి ఒకరికి కూడా సూపర్ ఎంటర్టైన్మెంట్ పంచుతుంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా ఇక్కడ క్రికెట్ ఆడటమే అభం శుభం తెలియని 12 ఏళ్ల బాలుడి ప్రాణం పోవడానికి కారణమైంది. అదేంటి క్రికెట్ ఆడటం కారణంగా ప్రాణాలు పోవడం ఏంటి అనుకుంటున్నారు కదా.. క్రికెట్లో జరిగిన గొడవ తో ఇక ప్రత్యర్థి జట్టులో ఉన్న మరో బాలుడు 12 ఏళ్ల బాలుడిని దారుణంగా కొట్టి చంపాడు.

 ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ లో చోటు చేసుకుంది అని చెప్పాలి. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఈనెల మూడవ తేదీన క్రికెట్ ఆడుతున్న సమయంలో ఇక వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే 12 ఏళ్ల బాలుడిని మరో బాలుడు బ్యాట్ తో కొట్టాడు. దీంతో వెంటనే బాలుడు స్పృహ తప్పి పడిపోగా.. వెంటనే ఆసుపత్రులకు తరలించారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 5వ తేదీన మరణించాడు బాలుడు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇక హత్య చేసిన మైనర్ గురించి గాలింపు చర్యలు చేపట్టారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: