దారుణం : ఆటోలో వెళుతుంటే.. కిడ్నాప్ చేసి అత్యాచారం.. చివరికి?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలను చూసిన తర్వాత సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాల అన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే సాటి మనుషులకు ఏదైనా ప్రమాదం వస్తేనే అయ్యో పాపం అంటూ జాలిపడి మానవత్వాన్ని చూపించే మనుషులు.. ఇక ఇప్పుడు మాత్రం పనిగట్టుకుని మరి పక్కవారికి హానిచేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. వెరసి ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని  షాక్ కి గురి చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నేటి రోజుల్లో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు అయితే రోజురోజుకు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి.



 ఆడపిల్ల కనిపించింది అంటే చాలు మగాళ్లలో ఉండే మృగాలు బయటికి వచ్చి చివరికి దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతూ ఉన్నారు. ఒకప్పుడు ఒంటరిగా ఉన్న మహిళలను మాత్రమే టార్గెట్ చేసుకొని అత్యాచారాలు చేసేవారు. కానీ ఇప్పుడు పక్కన కుటుంబ సభ్యులు ఉన్న.. వారిపై దాడి చేసి మరి దారుణంగా అత్యాచారాలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అటు కోర్టుల్లో కఠిన శిక్షలు విధించిన.. కామాంధులు తీరులో మాత్రం ఎక్కడ మార్పు రావడం లేదు అని చెప్పాలి. తెలంగాణలోని ఖమ్మంలో కూడా ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకుంది.



 కామంతో ఊగిపోయిన కొంతమంది నీచులు ఏకంగా ఒక మహిళను కిడ్నాప్ చేసి మరి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ మహిళపై దారుణంగా దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర గాయాల పాలైన సదరు మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఏప్రిల్ 27వ తేదీన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి అత్తా కోడలు వచ్చారు. ఆటోలో వెళుతున్న మహిళను కొందరు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. అయితే అతి కష్టం మీద కామాంధుల నుంచి తప్పించుకుంది. తీవ్ర గాయాలు పాలైన మహిళను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. మృతురాలు చెన్నారావుపేట మండలం రామన్న గుట్ట తాండకు చెందినదిగా గుర్తించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: