అయ్య బాబోయ్.. బతికుండగానే.. అంతిమయాత్ర చేసుకున్నాడు?
ఇక ఇప్పుడు ఇలాంటి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా ఎవరికి అయినా సరే చనిపోయిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించడం చేస్తూ ఉంటారు. అయితే ప్రాణం పోయిన వ్యక్తులకు అంత్యక్రియలు ఎలా జరుగుతున్నాయి అన్న విషయం మాత్రం తెలియదు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం తన అంత్యక్రియలు ఎలా జరుగుతాయో చూడాలని భావించాడు. ఈ క్రమంలోనే బతికుండగానే అంతిక్రియలు చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
కొండలం పట్టుకు చెందిన జయమని అనే వ్యక్తి విచిత్రమైన పని చేసి వార్తల్లోకి ఎక్కాడు. బతికుండగానే అంతిమయాత్ర చేసుకుంటానంటూ ఏకంగా స్థానికంగా ఉండే మరియమ్మన్ అమ్మవారికి మొక్కుకున్నాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులను ఒప్పించి మరి ఊరంతా సంతాప పోస్టర్లు వేయించాడు. పాడే మీద పడుకుని ఉన్న జయమనిని బంధువులు ఊరంతా ఊరేగించి స్మశానంలో వదిలిపెట్టారు అని చెప్పాలి. ఇక సాయంత్రానికి అతను మళ్లీ తిరిగి ఇంటికి వచ్చేసాడు. అయితే ఈ విషయం గురించి తెలిసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇక స్థానికంగా జయమని చేసిన పని కాస్త తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.