కుక్కతో భార్యకు పెళ్లి చేసిన భర్త.. ఎందుకు తెలుసా?

praveen
సోషల్ మీడియాలో వింత వీడియోలకు , వింత ఘటనలకు కొదవ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అందుబాటులో వచ్చిన నేపథ్యంలో  ఇక అన్ని విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకొని అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఇలా కొన్ని కొన్ని సార్లు ఇంటర్నెట్లోకి వచ్చే కొన్ని విచిత్రమైన ఘటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక నేటి సభ్య సమాజంలో ఇలాంటి తరహా విచిత్రమైన మనుషులు కూడా ఉన్నారా అని ప్రతి ఒక్కరికి కూడా ఈ ఘటనలు చూసిన తర్వాత ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది.

 ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినది అని చెప్పాలి. సాధారణంగా అయితే పెళ్లి చేసుకుని ఒక యువతిని భార్యగా స్వీకరించిన తర్వాత ఆమెకు సంబంధించిన అన్ని బాధ్యతలు భర్తే చూసుకుంటూ ఉంటాడు. అంతేకాదు ఇక భార్యకు ఏ కష్టం రాకుండా వెన్ను దన్నుగా నిలుస్తూ ఉంటాడు. ఇక పరాయి వ్యక్తుల చూపు భార్యపై పడినా కూడా అస్సలు సహించడు భర్త. అంతేకాదు ఇక కొన్ని సినిమాల్లో చూపించినట్లుగా ఏకంగా కట్టుకున్న భార్యను మరొకరికి ఇచ్చి పెళ్లి చేసి కట్టబెట్టడానికి అస్సలు సాహసం చేయడు భర్త అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక భర్త మాత్రం ఇలాంటిదే చేశాడు. అయితే తన భార్యను మరో మనిషికి ఇచ్చి పెళ్లి చేయడం కాదు ఏకంగా కుక్కకు ఇచ్చి పెళ్లి చేశాడు.

 పండితుడు చెప్పిన మాటను గుడ్డిగా ఫాలో అయిన సదరు భర్త ఇక ఇలా భార్యను కుక్కకు ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఇక ఈ విషయం తెలిసి ఒక రిపోర్టర్ వారి దగ్గరికి వెళ్లి ప్రశ్నించాడు. నేను నా భార్యకు కుక్కతో వివాహం చేశాను అంటూ భర్త చెప్పగా మేడం మీ ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నారా అంటూ మహిళను ప్రశ్నించాడు. రిపోర్టర్ అవును.. నా ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లి జరిగింది అంటూ ఆ మహిళ సమాధానం చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. స్థానికంగా అందరూ కూడా ఈ ఘటన గురించి చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: