పేరెంట్స్ అలా అన్నారని.. ఉరి వేసుకున్న యువకుడు?
పెద్ద పెద్ద చదువులు చదివిన వారు విచక్షణ తో ఆలోచించకుండా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ చివరికి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు అని చెప్పాలి. సాధారణంగా ఎవరినైనా సరే కొన్ని కొన్ని విషయాల్లో తల్లిదండ్రులు మందలించడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అయితే ఇక ఇలా తల్లిదండ్రులు మందలించడంతో చివరికి ఎంతో మంది పిల్లలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో కూడా ఇలాంటిదే జరిగింది.
చైతన్యపురి కాలనీలో నివాసం ఉంటున్నాడు 26 ఏళ్ల సాయికుమార్. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సాపూర్ పట్టణంలోని సిమెంట్ దుకాణంలో పనిచేస్తూ ఉంటాడు సాయికుమార్. అయితే నాలుగు రోజులుగా పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. దీంతో ఎందుకు పనికి వెళ్లడం లేదు అంటూ తల్లిదండ్రులు ప్రకటించారు. పనికి వెళ్లాలి అంటూ సూచించారు దీంతో మనస్థాపం చెందిన సాయికుమార్ చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు అని చెప్పాలి. దీంతో ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కొడుకు ఫ్యాన్ కు వేలాడుతూ ఉండడం చూసి ఒక్కసారిగా గుండెలు పగిలేలా ఏడ్చారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.