టీవీ చూడొద్దు అన్నందుకు.. యువతి ఏం చేసిందో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో మనిషి జీవితానికి కాస్తైన విలువ లేకుండా పోయింది అన్నది అర్థమవుతుంది. అయితే ఇది ఎవరో చెబుతూ ఉండటం కాదు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలో చెప్పకనే చెబుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే ఆధునిక సమాజంలో ప్రతి విషయంలో కూడా ఎంతో గొప్పగా ఆలోచించాల్సిన మనుషులు.. చివరికి చిన్న చిన్న సమస్యలకే మనస్థాపం చెందుతూ బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు కోకోళ్ళలుగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి  దేవుడు ఇచ్చిన నిండు నూరేళ్ల జీవితాన్ని ఎంతోమంది ఇక చేతులారా తీసేసుకుంటున్నారు.


 ముఖ్యంగా నేటి రోజుల్లో యువత ఇలా క్షణికా విషయంలో నిర్ణయాలు తీసుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తక్కువ మార్కులు వచ్చాయని కొంతమంది లేదా పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఇంకొంతమంది లేదంటే స్నేహితులతో గొడవ జరిగిందని మరి కొంతమంది మనస్థాపం చెందుతున్నారు.  దీంతో ప్రతి సమస్యకు ఆత్మహత్య ఒకటి పరిష్కారం అన్న విధంగానే వ్యవహరిస్తూ చివరికి తల్లిదండ్రులకు కడుపుకోత  మిగులుస్తున్నారు.  ఇక్కడ టీవీ కారణంగా ఏకంగా యువతి ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల కాలంలో టీవీ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఎంతోమందిని బానిసలుగా మార్చుకుంటుంది టీవీ. ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి టీవీ ముందే గంటల తరబడి కూర్చుంటున్నారు ఎంతోమంది.


 ఇక ఇప్పుడు టీవీ చూడటమే అమ్మాయి ప్రాణం పోవడానికి కారణమైంది. గత కొన్ని రోజుల నుంచి ఓ యువతి టీవీకి బానిసగా మారిపోయింది. గంటల తరబడి టీవీ ముందు కూర్చుని చదువుకోవడమే మానేసింది. ఈ క్రమంలోనే టీవీ చూడొద్దు అంటూ ఇక తల్లి ఆ యువతీని మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సదరు యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్లోని నేరేడ్మెట్ లో జరిగింది. తల్లి మందలించింది అనే కారణంతో సుకృత అనే 12 ఏళ్ల యువతి ఉరివేసుకొని చనిపోయింది. క్షణికావేశంలో యువతి తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను మిగిల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Tv

సంబంధిత వార్తలు: