తహసిల్దార్ ఆత్మహత్య.. కారణమేంటో తెలుసా?

praveen
ఇటీవల కాలం లో ఆత్మహత్య అనేది ప్రతి సమస్యకు పరిష్కారంగా మారిపోయిందేమో అని అనిపిస్తుంది నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే. ఎందుకంటే ఒకప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడి ఎదుర్కొనే వాడు మనిషి. ఎక్కడ భయపడకుండా ఈ సమస్య పెద్దదేమీ కాదు అని తనకు తాను సర్ది చెప్పుకొని ముందుకు సాగేవాడు. కానీ ఇటీవల కాలంలో మాత్రం చిన్న చిన్న సమస్యలకే మనస్థాపం చెందుతూ అక్కడితో జీవితం ముగిసిపోయింది అని భావిస్తూ బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.

 దేవుడు ఇచ్చిన విలువైన ప్రాణాలను మనిషి స్వయంగా తీసుకుంటూ ఎన్నో కుటుంబాలలో విషాదం నింపుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇలాంటి తరహా ఘటనలు నేటి రోజులు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నాయి. స్కూల్లో చదివే విద్యార్థులు దగ్గర నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వారి వరకు కూడా అందరూ ఇలాగే ఆలోచిస్తున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఆత్మహత్య ఒక్కటే అని అనుకుంటూ ఉన్నారు క్షణికావేషంలో నిర్ణయాలు తీసుకుంటూ చివరికి చేజేతులారా  ప్రాణాలను గాల్లో కలిపేసుకుంటున్నారు.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండల తాసిల్దార్ గా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారిపోయింది. ఇటీవలే కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో భూ సర్వేల విషయంలో ఉన్నతాధికారులు శ్రీనివాసరావు పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో మనస్థాపం చెందిన ఆయన ఎమ్మార్వో కార్యాలయం పక్కనే ఉన్న ఒక షెడ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
ఈ ఘటన కాస్త సంచలనగా మారిపోయింది అని చెప్పాలి. ఇకపోతే రెవెన్యూ ఆఫీసర్ సూసైడ్ వెనుక అసలు కారణాలు ఏంటి అన్న విషయాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: