
భార్యకు హెచ్ఐవి సోకిందని.. భర్త ఏం చేశాడో తెలుసా?
ఎందుకంటే కష్టసుఖాల్లో పాలుపంచుకుని ఎప్పుడు ఒకరికి ఒకరు తోడునీడుగా ఉండాల్సిన వారు చిన్నచిన్న కారణాలతోనే ఏకంగా విడిపోవడానికి సిద్ధమవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా పెళ్లయిన కొన్నాళ్లకే ఆ పెళ్లి పెటాకులుగా మారిపోతుంది అని చెప్పాలి. ఎంతోమంది ఇక కోర్టులను ఆశ్రయిస్తూ విడాకులు తీసుకుంటున్నారు. మరి కొంతమంది ఏకంగా జీవితం నాశనం అయిపోయింది అని బాధపడుతూ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి.
ఇక్కడ ఒక విచిత్రమైన ఘటన వెలుగు చూసింది అని చెప్పాలి. ఏకం గా తన భార్యకు హెచ్ఐవి ఉందని విడాకులు ఇప్పించాలి అంటూ ఒక వ్యక్తి బాంబే హై కోర్టును ఆశ్రయించాడు. అయితే హైకోర్టు మాత్రం సదరు భర్తకు షాక్ ఇచ్చింది. ఎందుకంటే అతని భార్యకు హెచ్ఐవి సోకినట్లు నిర్ధారించే సాక్షాదారాలు ఏవి అతను కోర్టు లో సమర్పించలేదు. దీంతో అతని విడాకుల పిటిషన్ను కొట్టివేసింది బాంబే హైకోర్టు. కాగా పూనేకు చెందిన దంపతులకు 2003లో పెళ్లి జరగగా.. భార్య తనతో తన కుటుంబ సభ్యుల తో సరిగా ఉండడం లేదని.. ఇప్పటికే ఎన్నో వ్యాధుల బారిన పడిందని.. 2005లో హెచ్ఐవి కూడా వచ్చినంటూ భర్త ఆరోపించిగా ఆధారాలు లేకపోవడం తో బాంబే హైకోర్టు కేసును కొట్టివేసింది.