సూసైడ్ చేసుకుంటున్న అంటూ సెల్ఫీ వీడియో.. కానీ 10 నెలల తర్వాత ట్విస్ట్?

praveen
ఇటీవల కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా దానికి ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం అన్న విధంగా మనిషి ఆలోచన తీరు మారిపోయింది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తద్వారా నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగానే ముగిస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ఏకంగా తాము ఎందుకు చనిపోతున్నాము అన్న విషయాన్ని కూడా ఏకంగా సెల్ఫీ వీడియో ద్వారా అందరికీ తెలియజేసి సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు ఇటీవల కాలంలో కోకోల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.

 ఇక్కడ కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.. ఏకంగా ఒక వ్యక్తి తాను సమస్యల కారణంగా సూసైడ్ చేసుకుంటున్నాను అంటూ చెప్పి సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.  ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహం కోసం పది నెలలపాటు గాలించిన ప్రయోజనం లేకుండా పోయింది. కానీ చివరికి ఊహించిన ట్విస్ట్ ఈ కేసులో బయటపడింది. సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పి కనిపించకుండా పోయి ఇక స్నేహితులతో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు సదరు వ్యక్తి.

 మధ్యప్రదేశ్ లోని కండువా పరిధి గస్పురాకు చెందిన షేక్ జునైద్ అనే వ్యక్తి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అతని తండ్రికి పక్షవాతం రావడంతో చివరికి తండ్రి ఉద్యోగం కొడుక్కి వచ్చింది. గతంలో రియల్ ఎస్టేట్ చేస్తూ ఉండేవాడు.  కానీ కరోనా కారణంగా వ్యాపారం దెబ్బతింది. ఈ క్రమంలోనే ఏకంగా 150 మంది దగ్గర ఐదు కోట్ల వరకు అప్పు చేశాడు. ఇక వారు తిరిగి చెల్లించాలంటూ ఒత్తిడి తీసుకురావడంతో ఇక తనకు అప్పులు ఉన్న కారణంగా చనిపోతున్నా అంటూ ఒక సెల్ఫీ వీడియో తీసుకుని నదిలో దూకేశాడు. కేసు నమోదు  చేసుకున్న పోలీసులు ఇక మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. కానీ ఇండోర్ రాయపూర్ ముంబై తదితర ప్రాంతాలలో స్నేహితులతో జునైద్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వెలుగులోకి రావడంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: