
అంత్యక్రియలు.. కానీ మరునాడు తిరిగొచ్చాడు?
ఇక ఇలాంటి ఘటనలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నయని చెప్పాలి. అయితే ఒక వ్యక్తి మరణించిన తర్వాత వాళ్లకి పునర్జన్మ ఉంటుందని పురాణాలు చెబుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇక వ్యక్తి చనిపోయాక అంత్యక్రియలు నిర్వహిస్తే అతని ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుందని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు.. ఒక వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత మరునాడే అతను ఇంటికి తిరిగి వచ్చాడు. అదేంటి అంత్యక్రియలు జరిగిన తర్వాత ఎలా తిరిగి వస్తాడు అని అనుకుంటున్నారు కదా..
ఇంతకీ ఏం జరిగిందంటే.. కుమారుడే అని భావించి మరో మృతదేహానికి కుటుంబ సభ్యులు బరువెక్కిన హృదయంతో అంత్యక్రియలు నిర్వహించారు. కానీ ఆ మరునాడే కొడుకు కళ్ళ ముందుకూ వచ్చి నిలబడడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ వింత ఘటన నెల్లూరు జిల్లా మనబోలు మండలం వడ్లపూడిలో వెలుగు చూసింది. వడ్లపూడి కి చెందిన ఒక వ్యక్తి నాలుగు నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. అంతలోనే చెరువులో ఒక మృతదేహం లభించింది. తమ కుమారుడే అని భావించి తల్లితండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు. నాడే కనిపించకుండా పోయిన కుమారుడు ఇంటికి వచ్చేసాడు దీంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. అయితే ఖననం చేసిన మృతదేహం ఎవరిది అన్నది మాత్రం తెలియ రాలేదు.