అక్రమ రవాణా.. ఎలాంటి ప్లాన్ వేశారో తెలుసా?

praveen
ఇటీవలి కాలం లో అక్రమార్కులు ఎంతలా రెచ్చి పోతున్నారో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. నిషేధిత డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయా లో అంతకు మించి అనే రేంజ్ లోనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనం సినిమా లో చూసినప్పుడు వామ్మో ఇలా కూడా అక్రమ రవాణా చేస్తారా అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నిజ జీవితం లో మాత్రం సినిమాలు కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే డ్రగ్స్ గంజాయి లాంటివి అక్రమ రవాణా చేయడానికి సరికొత్త దారులను  వెతుకుతూ ఉన్నారు అనే చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇక విమానాశ్రయాల లో అక్రమార్కులను కనిపెట్టడం పోలీసులకు, కస్టమ్స్ అధికారులకు పెద్ద సవాలు గానే మారి పోయింది అని చెప్పాలి. అయినప్పటికీ ఎప్పటికప్పుడు అప్రమత్తం గా ఉంటూ అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. ఇటీవల కాలం లో ఎంతో మంది విదేశాల నుంచి భారత్కు భారీగా గంజాయి డ్రగ్స్ లాంటివి తీసుకు వస్తూ చివరికి కస్టమ్స్ అధికారులకు పట్టు బడుతూ చిప్పకూడు తింటున్న  సంఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. ఇక్కడ కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది అని చెప్పాలి.

 చెన్నై విమానాశ్రయం లో భారీగా డ్రగ్స్ పట్టు పడిన ఘటన సంచలనంగా మారి పోయింది. ఒక వ్యక్తి నుంచి ఏకంగా వంద కోట్ల విలువైన పది కిలోల హెరాయిన్, కొకైన్ లాంటి మాదకద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇతియోఫియో నుంచి డ్రగ్స్ తరలిస్తున్నారని సమాచారంతో భారత్కు చెందిన ఇక్బాల్ పాష అనే వ్యక్తిని అధికారులు తనిఖీ చేయగా దుస్తువులు, షూ, బ్యాగ్ లో డ్రగ్స్ ను గుర్తించారు. ఇక మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లోఇంత భారీ మొత్తం లో డ్రగ్స్ పట్టుబడడం ఇదే మొదటిసారి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: