వాటర్ బాటిల్.. విద్యార్థి ప్రాణం తీసింది?

praveen
కొన్ని కొన్ని సార్లు అనుకోని విధంగా మృత్యువు దరిచేరుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారిగా ఇలాంటి ఘటనలతో షాక్  అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే  కొన్నిసార్లు విధి చిన్నచూపు చూసి  కుటుంబంలో తీరని విషాదాన్ని నింపుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. ఎప్పటిలాగే తోటి విద్యార్థులతో కలిసి సంతోషంగా పాఠశాలకు బయలుదేరింది ఆ బాలిక వెళ్లి వస్తాను అంటూ అమ్మ నాన్నకి టాటా కూడా చెప్పింది. అయితే ఆ చిన్నారి బాలిక అలా బయలుదేరిందో లేదో అంతలోనే ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది.
 విద్యార్థులు వెంట తీసుకు వెళుతున్న వాటర్ బాటిల్ ఆటో నుంచి కింద పడిపోవడంతో దాన్ని అందుకునే ప్రయత్నం లో చివరికి ఆ బాలిక కూడా ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. దీంతో ప్రాణాలు కోల్పోయింది. కళ్ళముందే కూతురు ప్రాణాలు కోల్పోవడం చూసిన తల్లిదండ్రులు గుండె పగిలిపోయింది. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎలకల పల్లి వద్ద చోటుచేసుకుంది అని చెప్పాలి. ఎలకల పల్లి గ్రామానికి చెందిన తన్నీరు స్వామి రజిత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి అమూల్య అనే కూతురు ఉంది..

 అయితే కుమారుడి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇక కూతురే లోకంగా బ్రతుకుతున్నారు ఆ తల్లిదండ్రులు. ఇక వారికి ఉన్నంతలో దగ్గరలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో అమూల్యను చేర్పించారు. కాగా ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది  అయితే పాఠశాల యాజమాన్యం సమకూర్చిన టాటా మ్యాజిక్ ఆటోలో ఎప్పటిలాగానే స్కూల్ కి వెళ్ళింది. ఇక ఇలా వెళుతున్న సమయంలో అమూల్య వాటర్ బాటిల్ రోడ్డుపై పడి పోయింది. ఇక ఆ బాటిల్ తీసుకునేందుకు ప్రయత్నించిన అమూల్య చివరికి వేగంగా వెళ్తున్న ఆటోల నుంచి అదుపు తప్పి కింద పడిపోయింది. తీవ్రగాయాలు కాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చివరికి మృతి చెందింది. ఇక కూతురు మృతితో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: