యజమానిని కాపాడేందుకు.. ప్రాణం వదిలిన గేదె.. ఏం జరిగిందంటే?

praveen
జంతువులకు మనుషుల్లాగ ఆలోచించే శక్తి ఉండదు అని అంటూ ఉంటారు. కానీ ఎందుకో మనుషుల హావభావాలను సాటి మనుషులకంటే జంతువులే బాగా అర్థం చేసుకుంటాయేమో అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని రకాల ఘటనలు చూస్తూ ఉంటే. ముఖ్యంగా ఇటీవలి కాలంలో యజమాని పెంపుడు జంతువుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యజమాని కళ్ళల్లోకి చూసి యజమాని మనసులోని మాటను అర్థం చేసుకోగలుగుతున్నాయి జంతువులు.  అయితే కేవలం పెంపుడు కుక్కలు మాత్రమే కాదు ఇంకా ఎన్నో జీవులతో ప్రతి మనిషికి అనుబంధం ఉంది అని చెప్పాలి. పాడి పశువుల సైతం ఇలా వారి యజమాని పట్ల విశ్వాసాన్ని ప్రేమను కలిగి ఉంటాయి అని చెప్పాలి. ఇక వారి యజమాని కళ్ళముందు కనిపించాడు అంటే చాలు తమదైన భాషలో అరుస్తూ సైగలు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటాయి.

 అయితే ఇప్పటివరకు విశ్వాసానికి మారుపేరు కేవలం పెంపుడు కుక్కలు మాత్రమే అని అందరూ చెబుతుంటారు. కానీ పాడి పశువులు కూడా యజమానుల పట్ల ఎంతో విశ్వాసంతో ఉంటాయి అన్నది మాత్రం ఇక్కడ జరిగిన ఘటనతో అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఏకంగా ఒక గేదె యజమాని ప్రాణాలు కాపాడటానికి తన తనువు చాలించింది. కరెంట్ షాక్ తో యజమాని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే ఎంతో దూరం నుంచి ఇది గమనించిన గేదె ఇక అక్కడికి పరుగులు పెట్టుకుంటూ వచ్చింది. చివరికి కిందపడిపోయిన కరెంటు వైర్లు గేదె ను కూడా అంటుకోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.

 ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్లోని బాదోహి లో వెలుగులోకి వచ్చింది. బాబు సరాయ్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల పరాస్ పటేల్ అనే వ్యక్తి రాత్రి ఇంటి బయట మంచం మీద నిద్రిస్తున్నాడు. అయితే అర్ధరాత్రి అకస్మాత్తుగా వర్షం మొదలైంది ఇంతలోనే పరాస్ పటేల్ మంచం  తీసుకుని ఇంట్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇలాంటి సమయంలో విద్యుత్ తీగలు తగిలి కిందపడిపోయాడు. ఇక తీగలు అతని అంటుకోవడంతో పరాస్ పటేల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతిచెందాడు. గమనించిన అతని కుమారుడు శివశంకర్ అక్కడికి చేరుకొని తండ్రిని రక్షించే ప్రయత్నం చేయబోయాడు. ఆ సమయంలో అతను కూడా షాక్ కి గురయ్యారు. ఈ క్రమంలోనే పక్కనే పశువుల కొట్టంలో కట్టేసి ఉన్న గేదె ఇది చూసి యజమాని కష్టాల్లో ఉండడాన్ని గమనించింది. దీంతో పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. చివరికి యజమాని ని కాపాడే క్రమంలో విద్యుదాఘాతానికి  గురై ప్రాణాలు కోల్పోయింది. కాగా శివశంకర్ తీవ్ర గాయాలపాలైన చికిత్సపొందుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: