కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి.. కోర్టు ఏం శిక్ష వేసిందో తెలుసా?

praveen
ప్రతి ఆడపిల్ల అనుక్షణం భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది . కారణం నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలే. సభ్య సమాజంలో మానవత్వం ఉన్న మనుషుల కంటే  కామంతో కళ్లు మూసుకుపోతున్న మానవ మృగాలు లాంటి మనుషులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయ్. ఈ క్రమంలోనే ఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలా దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న పరిస్థితి ఎలా ఉంది. దీంతో ఆడపిల్ల ఇంటి నుంచి కాలు బయట పెట్టింది అంటే చాలు మళ్ళీ క్షేమంగా ఇంటికి వస్తుందా లేదా అన్నది కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది నేటి రోజుల్లో.

 అయితే ఇక బయట ఆకతాయిల నుంచి ఎదురైన లైంగిక వేధింపుల సమస్యలు పరిష్కరించాలంటూ ఇంట్లో వాళ్లకు చెప్పడం చేసేవారు ఆడపిల్లలు. కానీ ఇటీవల కాలంలో మాత్రమే ఇంట్లో వారు సైతం కామాంధులు గా మారిపోయి లైంగిక వేధింపులకు పాల్పడుతూ అత్యాచారాలు చేస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని సిగ్గుపడేలా చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కంటికి రెప్పలా కాచుకోవలసిన కూతురిపై కన్న తండ్రి కామపు కోరలు విసురుతూ ఉంటే ఇక తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆడపిల్ల తనలో తానే కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్న ఘటన చూస్తూనే ఉన్నాం.
 అయితే ఇటీవల ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడినవారికి కోర్టులు కఠిన శిక్షలు విధిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఒక కామాంధుడైన తండ్రి కఠినమైన జైలు శిక్ష విధించింది. కంటికి రెప్పలా బిడ్డను చూసుకోవాల్సిన తండ్రి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇక ఈ కిరాతక తండ్రి 20 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది మంగళూరు జిల్లా కోర్టు. విట్ల గ్రామ నివాసి 2020 మార్చిలో మైనర్ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. ఇక ఇటీవల విచారణలో నేరం రుజువు కావడంతో 20 ఏళ్ల కఠిన శిక్షతోపాటు 25 వేల జరిమానా విధించింది కోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: