షాకింగ్ : అధికారులు చేసిన పనికి.. ఊరు వదిలిన రైతు?

praveen
రోజులు మారుతున్న కొద్దీ ప్రతి ఒక్కరి జీవనశైలిలో మార్పులు వస్తున్నాయి. కానీ అటు దేశానికి అన్నం పెట్టే రైతుల బ్రతుకులు మాత్రం మారడం లేదు. ఏనాడు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఒకవేళ గిట్టుబాటు ధర వస్తుందని ఆనందపడే లోపే ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రమైన నష్టం చేకూరుతుంది. ఇలా రోజు రోజుకి రైతు పరిస్థితి అధ్వానంగా మారిపోతుంది తప్పా ఎక్కడ బాగుపడటం లేదు అని చెప్పాలి. అదే సమయంలో పంట పండించి నలుగురికి అన్నం పెట్టేందుకు రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే ఆ రుణాలు వసూలు చేసే సమయంలో బ్యాంకు అధికారులు రైతుల పట్ల వ్యవహరించిన తీరు  దారుణంగా ఉంటుంది.

 వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతున్న వారిని చూసీచూడనట్లు వ్యవహరించే బ్యాంకులు.. ఎందుకో నలుగురికి అన్నం పెట్టి కష్టాన్ని నమ్ముకుని బ్రతికే రైతులను మాత్రం చిన్న చూపు చూస్తున్నాయి. ఇక ఇటీవలే రుణ బకాయిలు వసూలు సమయంలో ఒక రైతు విషయంలో డిసిసిబి అధికారులు వ్యవహరించిన తీరు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలకు తావిస్తుంది. ఇక అధికారుల తీరుతో తీవ్ర మనస్తాపం చెందిన రైతు చివరికి ఊరు వదిలి వెళ్ళిపోయాడు. రైతు రుణ బకాయిలు చెల్లించే లేనందున భూమిని వేలం వేస్తామని ఒక ఫ్లెక్సీ  తయారుచేయించి పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులు నోటీసులు అంటించారు.

 ఇక అధికారులు ఇలా వ్యవహరించడం వల్ల కనీసం అటు ఊర్లో రుణం పుట్టే పరిస్థితి లేదని రైతు ఆందోళన చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కంసాన్పల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. శంకర్ రెడ్డి కి స్థానికంగా 3.31 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. స్థలానికి సంబంధించిన పత్రాలు సమర్పించి 2012-13 లో జోగిపేట పట్టణంలో  రుణం తీసుకున్నాడు. పంట సరిగా పండక పోవడంతో చివరికి రుణం చెల్లించలేక పోయాడు.  ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ పైన ఆశలు పెట్టుకున్నాడు. అదే సమయంలో బ్యాంక్ అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. ఇటీవల రుణం చెల్లించ నందుకు భూమిని వేలం వేస్తామంటూ పంచాయతీ కార్యాలయం వద్ద ఫ్లెక్సీ పెట్టడంతో ఊరు వదిలి వెళ్ళిపోయాడు ఆ రైతు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: