ప్రభుత్వాసుపత్రిలో దారుణం..మత్తు మందు ఇచ్చి..

Satvika
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం కొత్త చట్టాలను అమలు చేస్తూ వస్తుంది..ఎంతగా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందో అంతకుమించి దాడులు కూడా జరుగుతూన్నాయి.. ఇప్పటికే మనం రోజుకు ఎన్నో ఘటనలను చూసి ఉన్నాము..నిర్భయ, దిశ లాంటి ఎంతో మంది తమ మాన ప్రాణాలను అర్పించారు.అయిన సమాజంలో ఎటువంటి మార్పులు లేవు..దేశం నలుమూలల ఎక్కడో చోట, దారుణాలు జరుగుతున్నాయి..ఆఖరికి ఆసుపత్రుల లో కూడా రోగులను వదలడం లేదు.ఇలాంటి ఘటన తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. ఓ డాక్టర్ వైద్యం చెయ్యకుండా రోగి పై తన వక్రబుద్దిని చూపించారు.

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన 23 ఏళ్ల యువతిపై లైంగిక దాడి చేశాడు..కాంట్రాక్టు ఉద్యోగి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అజ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మీర్‌కు చెందిన ఓ 23 ఏళ్ల యువతి.. గత కొంతకాలంగా లో బీపీ సమస్యతో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం.. స్థానికంగా ఉన్న జేఎల్ఎన్ ప్రభుత్వాసుపత్రికి తన సోదరుడితో కలిసి చికిత్స చేయించుకునేందుకు వెళ్లింది. ఈ సమయంలో అక్కడ కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న నిందితుడు రాజేష్‌ను సంప్రదించారు. అమె అడ్మిట్ అయిన తర్వాత తమ్ముడు వేరే పనిమీద బయటకెళ్లాడు. ఇదే అదనుగా భావించిన కాంట్రాక్ట్ ఉద్యోగి రాజేశ్.. ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు.

బాధితురాలి సోదరుడు మరలా వచ్చి చూసేసరికి ఆమె స్పృహతప్పి పడిపోయి ఉంది. మాట్లాడే స్థితిలో కూడా లేకపోవడంతో.. వెంటనే వేరే ఆసుపత్రికి ఆమెను తరలించాడు. అనంతరం యువతి తల్లి.. తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.ఆసుపత్రిలో మహిళపై రాజేష్ అత్యాచారం చేశాడని బాధితురాలి తల్లి ఆరోపించింది. ఆమెకు కొన్ని మత్తుమందులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: