పునుగుల కోసం గొడవ..ఏకంగా పీకలు కోసి..

Satvika
తిండి విషయంలో కొంతమంది వెనక్కి తగ్గరు.. బాగుంటే మాత్రం ఫుల్లుగా లాగిస్తారు..బాగా లేదు అంటే మాత్రం హోటల్ వాళ్ళకు చుక్కలు చూపించి, ముక్కు పిండి డబ్బులు వసూల్ చేస్తున్నారు..లేదు అంటే గొడవలకు దిగుతున్నారు.చిన్న చిన్న కారణాలకే పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి. మనోభావాలు దెబ్బతిని ఊరికే మనస్థాపానికి కూడా గురవుతుంటారు. కాస్తంత సహనంతో ఉంటే సర్దుకునే సమస్యలకు రక్తపాతాలు జరుగుతున్నాయి.తాజాగా మరో ఘటన వెలుగు చూసింది..


పునుగుల లోకి చట్ని సరి పోలేదని ఓ వ్యక్తి ఏకంగా పీకను కోసేశాడు.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.
వివరాల్లొకి వెళితే.. ఇంకొల్లు మండలం పెదనక్కలపాలేనికి చెందిన చిలిపూరి రంగారావు గ్రోత్‌సెంటర్ వద్ద నేషనల్ హైవే పై టిఫిన్ సెంటర్ పెట్టుకుని జీవిస్తున్నారు. రోజూ మాదిరిగానే ఆదివారం కూడా షాప్ ఓపెన్ చేసి వ్యాపారం చేస్తున్నాడు. గ్రోత్ సెంటర్‌కు చెందిన కొండారెడ్డి అనే వ్యక్తి అక్కడకు వచ్చి ప్లేట్ పునుగులు కావాలని అడిగాడు. రంగారావు పునుగులను కొండారెడ్డికి ఇచ్చాడు. అయితే, చట్నీ చాల్లేదని.. పునుగులు కూడా బాగాలేవని రంగారావుతో కొండారెడ్డి గొడవ పడ్డాడు.


గొడవ తర్వాత అక్కడ నుంచి వెళ్లిన కొండారెడ్డి కాసేపటి తర్వాత తన బావ అయిన కాశిరెడ్డిని వెంటబెట్టుకుని వచ్చి నానా వీరంగం సృష్టించాడు. వాళ్లిద్దరూ కలిసి రంగారావును చితకబాదారు. ఆ తర్వాత పక్కనే ఉన్న కూరగాయల కత్తి తీసుకుని రంగారావు గొంతు కోశారు. ఆపేందుకు ప్రయత్నించిన రంగారావు కొడుకు మనోహర్‌పైన కూడా తీవ్రంగా దాడి చేసి అక్కడ నుంచి పరారయ్యారు. ఈ సంఘటన తో రోడ్డుపై ఉన్న వారు, టిఫిన్ సెంటర్‌లో ఉన్నవారు అక్కడ నుంచి పరుగులు పెట్టారు..ఇద్దరు టిఫిన్ సెంటర్ లకు పోటీ వల్లే ఇదంతా చేసారని స్థానికులు చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరిపారు.అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: