
అయ్యో పాపం..భూమ్మీద పడగానే చిన్నారికి ఎంత కష్టం వచ్చింది..!
వివరాల్లొకి వెళితే..ఈ ఘటన ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. నవమాసాలు మోసి మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఎవరో కానీ, ఆ చిన్నారిపై కనికరం చూపలేదు. అప్పుడేపుట్టిన మగ శిశువును ముళ్లపొదలో పారవేసింది. శిశువు ఏడుపు విన్న స్థానికులు వెంటనే పోలీసులు, సమీప ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు. శిశువుకు వైద్యపరీక్షలు నిర్వహించారు. తల్లిదండ్రుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలిలా..
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ సమీపంలో అప్పుడే పుట్టిన మగశిశువును ముళ్ల పొదల్లో వదిలేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. తెల్లవారుజామున ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఓ మగ శిశువును ముళ్ళ పోదలు కింద వదిలేసి వెళ్లారు. శిశువు ఏడుపు శబ్ధాలు విన్న స్థానికులు పసికందును చూసి నివ్వెర పోయారు. వెంటనే స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆస్పత్రి మగ శిశువును ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అనంతరం చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం అందించారు..వాళ్ళు బిడ్డకు అన్నీ పరీక్షలను నిర్వహిస్తున్నారు... పిల్లాడి తల్లి దండ్రుల గురించి వెతికే పనిలో పోలీసులు ఉన్నారు.