
భార్యపై కేసు పెట్టిన జవాన్.. ఎందుకో తెలుసా?
తామిద్దరం కలిసి ఉన్న ఫొటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది అంటూ సదరు ఆర్మీ జవాన్ ఆరోపించారు. ఇక ఈ ఫోటోలలో అతడి ముఖం ఉండాల్సిన ప్లేస్ లో ఏకంగా కుక్క మొఖం జత చేసింది అంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటన ఆజ్మీర్ జిల్లాలోని మంగ్లీయా వాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. భీంపురం కు చెందిన మునవ్వర్ ఖాన్ ఇండియన్ ఆర్మీ లో సైనికుడా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే 2022 జనవరి 18వ తేదీన తన భార్య గేదలు బంగారం వెండి ఆభరణాల అపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ జవాన్.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరికి గేదెల ను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇంకా నగలు వెండి ఆభరణాలు మాత్రం ఆమె నుంచి రికవరీ చేయలేకపోయారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సదరు మహిళ భర్తకు దూరంగా ఉంటుంది. అప్పటి నుంచి ఆమె భర్తను వేధించడం మొదలు పెట్టింది. ఏకంగా పశువుల ఫోటోలతో భర్త ముఖం ప్లేస్ లో పెట్టి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది. కొన్నాళ్ళపాటు భరించిన భర్త చివరికి అవమానంగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానికంగా ఈ ఘటన హాట్ టాపిక్గా మారిపోయింది..