రోడ్డు ప్రమాదం.. భర్తే కూతురుని చంపాడంటూ భార్య ఫిర్యాదు?

praveen
కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత మనిషి ప్రాణాలు ఎప్పుడు పోతాయో కూడా తెలియని విధంగా మారిపోయింది పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రతిరోజు రేపు బాగుంటుందని ఆశతో బతకడం తప్ప.. ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది నేటి రోజుల్లో. ఇలాంటి సమయంలో ఒకవైపు మరోవైపు కరోనా లాంటి ఎన్నో రకాల వైరస్లు మనుషుల ప్రాణాలు తీయడానికి వస్తూ ఉంటే.. మనుషులు మాత్రం వైరస్లు ప్రాణం తీయడం ఏంటి మా చేతులతో ప్రాణాలు తీసుకుంటామనే విధంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ చివరికి ఎన్నో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు అన్న విషయం తెలిసిందే.

 కొన్ని ఘటనల్లో కొంతమంది చేసిన తప్పు కారణంగా అభం శుభం తెలియని అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటే. మరి కొన్ని ఘటనల్లో రోడ్డు నిబంధనలు పాటించక చేజేతులారా ప్రాణాలను తీసుకుంటున్న పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు ఇక ఇలాంటి రోడ్డు ప్రమాద ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయ్ అనే చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సంతోషంగా ఫ్యామిలీ అందరూ కలిసి  శుభకార్యానికి వెళ్లాడు. కానీ తిరిగి వస్తున్న సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది.

 అతి వేగం కారణంగా కారు బోల్తా పడింది.. ఈ ఘటనతో  ఆ కుటుంబంలో విషాదం నిండిపోయింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శంకర్పల్లి ఎల్లకొండ కు చెందిన దంపతులు రహీం, రేష్మ వారి పిల్లలు రెహమాన్, అన్షు తో కలిసి ఒక శుభకార్యానికి వెళ్లి తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో రహీం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం కారణంగా కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కూతురు అన్షు మృతి చెందింది. ఇక భర్త కారణంగానే తన కూతురు మృతి చెందిందని భార్య భర్త పై ఫిర్యాదు చేయడం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: