అయ్యో సారూ.. ఇలా బుక్ అయ్యావేంటి?

Satvika
ఈరోజుల్లో ఎవరినీ నమ్మడానికి లేదు..ఎందుకంటే ఎప్పుడూ మోసపోతామో చెప్పడం కాస్త కష్టమే..ఆడ వాళ్ళు మహా ముదురులు అని ప్రస్తుతం జరుగుతున్న ఘటనలను చూస్తే అర్థం అవుతుంది. డబ్బుల కోసం ఎలా మారుతున్నారు అని..అందం ముసుగు లో ఎన్నెన్నో దారుణాలకు పాల్పడుతున్నారు..తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.ప్రేమ పేరుతో మగవారిని ముగ్గులోకి దింపి, చివరకు మోసాలకు పాల్పడే మహిళలు కూడా చాలా మంది ఉన్నారు..ఇలాంటి వారు పైకి ప్రేమగా మాట్లాడుతున్నా.. వారి మనసులో మాత్రం కుట్ర కోణం దాగి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. హోటల్ గదికి వెళ్లి మహిళను కలిసి వచ్చిన అధికారి.. మరుసటి రోజే అలా అవుతుందని ఊహించలేకపోయాడు.

 
అసలు విషయాన్నికొస్తే..ఉత్తరప్రదేశ్ అయోధ్య పరిధిలో ఓ వ్యక్తి ప్రభుత్వ శాఖలో విధులు నిర్వర్తిస్తుంటాడు. కొన్ని రోజుల క్రితం ఓ మహిళ పని నిమిత్తం అధికారి వద్దకు వచ్చింది. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం ఏర్పడింది. పని పేరుతో రోజూ ఆఫీసుకు వెళ్లి అతడిని కలుస్తూ ఉండేది. ఇలా వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఓ రోజు సీక్రెట్‌గా మాట్లాడాలంటూ హోటల్ గదికి రమ్మని పిలిచింది. అక్కడికి వెళ్లిన అధికారితో కాసేపు ప్రేమగా మాట్లాడి, తర్వాత దుస్తులు మొత్తం విప్పించింది. అదే సమయంలో మరో వ్యక్తి అధికారికి తెలీకుండా ఫొటోలు, వీడియోలు తీశాడు. మహిళతో గడిపి ఇంటికి వెళ్లిన అధికారికి మరుసటి రోజు ఫోన్ వచ్చింది..


చాలా అర్జెంట్ గా 5 లక్షలు ఇవ్వాలని కోరారు..ఇవ్వకపోతే నీ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తా'' అంటూ మహిళ హెచ్చరించింది. దీంతో ఖంగుతిన్న అధికారి చివరకు రూ.3లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకొన్నాడు. అయితే పదే పదే మహిళ నుంచి ఒత్తిడి ఎక్కువవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కడం పూరు కు చెందిన ఖుష్బూ అలియాస్ సీమా అలియాస్ షామాను అరెస్ట్ చేశారు. వీరి వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు గుర్తించారు. వీరి ముఠాలో ఎవరెవరు ఉన్నారు, ఇలా ఎంతమందిని మోసం చేశారు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: