వరకట్న వేధింపులు.. ఆ ముగ్గురు అక్కచెల్లెలు ఏం చేశారంటే?
పెళ్లి చేసుకుని కోటి ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టిన ఎంతో మంది అమ్మాయిలకు ఇక అదనపు కట్నం వేధింపుల కారణంగా పున్నామ నరకం చూపిస్తున్నారు పెళ్లి చేసుకున్నవారు. భర్తతో పాటు అత్తమామలు కూడా ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇలా నేటి రోజుల్లో వరకట్న వేధింపులు పెరిగిపోతున్నాయ్ తప్ప ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు అని చెప్పాలి. ఇక వరకట్నపు వేధింపుల నేపథ్యంలో ఇక్కడ ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది.
ఏకంగా వరకట్న వేధింపులు తాళలేక ముగ్గురు అక్క చెల్లెలు కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్ లోని నరేనా రోడ్ లో వెలుగులోకి వచ్చింది. ముగ్గురు అక్క చెల్లెలు కాలు దేవి, మమతా, కమలేశు సహా మరో ఇద్దరు చిన్నారులు శవాలు బావిలో తెలడం కలకలం సృష్టించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములకు ఇచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. ఇక అప్పటినుంచి ఇక వీరి భర్తలు అత్తమామలు కూడా అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. దీంతో మనస్తాపంతో ఈ ముగ్గురు వివాహితలు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో మమతా, కామలేశు తొమ్మిది నెలల నిండు గర్భిణీ లు కావడం గమనార్హం..