
ఆమె నిండు గర్భిణీ.. భర్తతో గొడవ.. చివరికి ఏం చేసిందో తెలుసా?
ఇలా తిరుపతి లో ఆ మహిళ మొదలుపెట్టిన నడక నాయుడుపేట వరకు సాగింది. ఏకంగా 65 కిలోమీటర్లు నడిచి ఇక అర్ధరాత్రి నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ దగ్గరకు వెళ్ళేసరికి ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఏం చేయాలో ఎటు పోవాలో కూడా ఆమెకు అర్థం కాలేదు. ఈ క్రమంలోనే రోడ్డుపై నిలబడి తనకు ఎవరైనా సహాయం చేయాలంటూ వచ్చి పోయే వాహనాలను ఆపింది. కానీ పాడు సమాజం ఎవరు ఆమెను పట్టించుకోలేదు. కనీస కనికరం చూపించలేదు. ఇంతలోనే ఓ యువకుడు స్పందించాడు.
ఆమె వివరాలు తెలుసుకుని వెంటనే 108కి సమాచారం అందించాడు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది ఆమెను వాహనంలోకి ఎక్కించారు. అయితే బిడ్డ కిందకు జారి పోతుంది అని చెప్పడంతో వెంటనే ఆమెకు ఆంబులెన్స్ లో ని ప్రసవం చేశారు. ఇక ఆమె పరిస్థితి చూసి అంబులెన్స్ సిబ్బంది కడుపు కూడా తరుక్కుపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమ ఇళ్ల నుంచి మంచి దుస్తులు ధరించి తల్లి బిడ్డకు ఇచ్చారు. ఇక శిశువు బరువు తక్కువగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం నెల్లూరు ఆంబులెన్స్ లోని పంపించారు. ఇక ఆ తర్వాత తెలిసింది.. ఆమె పేరు వర్షిని అని.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని వైయస్సార్ నగర్ అని. భర్తతో గొడవలతో విసుగుచెందిన వర్షిని.. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా తిరుపతిలో బయల్దేరి కాలినడకన నాయుడుపేట వరకు వచ్చింది అని తేలింది.