నాలుగు రోజుల్లో పెళ్లి.. కానీ అంతలోనే?

praveen
మనిషి ప్రాణాలు ఎప్పుడు పోతాయో ఎవ్వరికీ తెలియదు. కానీ రేపు బాగుంటుంది అనే చిన్న ఆశతోనే మనిషి ప్రతిక్షణం సంతోషంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.  అయితే అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు మాత్రం ఊహించని విధంగా ప్రాణాలు పోతూ ఉంటాయి. దీంతో ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండి పోతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి ఒక విషాదకర ఘటన జరిగింది. నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకుని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు ఆ యువకుడు. కానీ అంతలోనే విధి అతనన్ని చిన్నచూపు చూసింది.

 కారు ఢీకొని చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలంలో వెలుగులోకి వచ్చింది. ఎదులాబాద్ కు చెందిన లక్ష్మీ, యాదయ్య గౌడ్ దంపతులకు ఏకైక కుమారుడు నాగరాజు గౌడు ఉన్నాడు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఏప్రిల్ 14న పెద్దలు పెళ్లి కుదిర్చారు. వివాహం యాదాద్రి భువనగిరి జిల్లా బండ సోమారం లో జరగాల్సి ఉంది. అందరికీ బంధుమిత్రులకు శుభలేఖలు పంచారు. ఇక ఇంట్లో అంతా సందడి వాతావరణం నెలకొంది. ఇటీవలే పెళ్లి సామాగ్రి కోసం ద్విచక్రవాహనంపై తన సోదరుడితో కలిసి ఘట్కేసర్ కు బయల్దేరాడు నాగరాజు.

 పెట్రోల్ బంక్ దగ్గరికి రాగానే వేగంగా దూసుకొచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు నాగరాజు. ఇక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ వినయ్ ని అరెస్టు చేసినట్లు తెలిపారు. అయితే కుటుంబ సభ్యులకు పరిహారం ఇవ్వాలి అంటూ అటు బంధువులు డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన పోలీసులు నచ్చజెప్పడంతో చివరికి ఆందోళన విరమించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: