శాపం ఉందని.. చేయి కోసుకున్న యువతి.. చివరికి?

praveen
ప్రస్తుతం దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతోంది. ఇలాంటి సమయంలోనే మనిషి జీవన శైలి లో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు టెక్నాలజీని వినియోగించుకుంటూ సరి కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే మూఢనమ్మకాలను అందరూ దూరం పెడుతూనే ఉన్నారు. ఒకప్పటి చిత్రవిచిత్రమైన కట్టుబాట్లను కూడా ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదు. ఇక మంత్రాలకు చింతకాయలు రాలుతాయ్ అన్న విషయాన్ని మాత్రం అందరూ మర్చిపోతున్నారు. ఈ క్రమంలోనే రోజురోజుకి  ఎన్నో దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి.

 ఆధునిక సమాజాన్ని వదిలేసి ఇంకా మూఢ నమ్మకాల వెంట నడుస్తున్న ఎంతో మంది జనాలు అనాలోచిత నిర్ణయాల కారణంగా చివరికి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఎన్నో అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఆ యువతికి శాపం ఉంది అని ఎవరో చెప్పారు. ఈ క్రమంలోనే  ఇక  శాపం ఉంది అన్న చెప్పిన విషయాన్ని గుడ్డిగా నమ్మిన సదరు యువతి చివరికి తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉంది అని భావించింది. శాపం కారణంగా తల్లిదండ్రులకు ఎలాంటి ప్రాణహాని జరగకూడదు అని భావించి తన ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమైంది.

 ఈ క్రమంలోనే ఇటీవల లాడ్జికి వెళ్లి తన చేయి కోసుకున్న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మార్కాపురంలో బీఎస్సీ చదువుతుంది ఓ యువతి. ఆమెకు ఇటీవలే సెలవులు వచ్చిన ఇంటికి వెళ్ళలేదు. లాడ్జ్ కి వెళ్లి చెయ్యి కోసుకుంది. శాపం వల్ల తన నీడ పడి తల్లిదండ్రులు తమ్ముడు చనిపోకూడదు అనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాను అంటూ తండ్రికి వాట్సాప్ మెసేజ్ చేసింది. ఇక శాపం పోవడానికి పూజలు చేయించిన ఫలితం కనిపించలేదు అంటూ ఆ యువతి మెసేజ్ లో తెలిపింది. ఈ క్రమంలోనే  అప్రమత్తమైన ఆ యువతి తండ్రి వెంటనే లాడ్జి కి వెళ్లి తన కూతురిని కాపాడుకున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: