బుల్లెట్ కోసం ప్రాణాలను తీసుకున్న యువకుడు..
విషయాన్నికొస్తే.. ఒంటరిగా ఉంటున్న తల్లి కొడుకుల మధ్యలోకి బుల్లెట్ బండి చిచ్చు పెట్టింది.కొడుకు కోసం ఉన్న పుస్తెల తాడును అమ్మి మరి డబ్బులు ఇచ్చింది. బండి ఖరీధు లక్ష రుపాయాలు..50 వేలు కట్టి బండిని కొన్నారు.అయితే బండికి ఇచ్చిన ఫైనాన్స్ కంపెనీ వాళ్ళ కిస్తిలు కట్టడం లేదని బండిని తీసుకొని వెళ్లారు..ఆ భాధను అతను భరించలేక పోయాడు. దాంతో తల్లికి, ఫ్రెండ్స్ కు చెప్పారు. బండి లేకుంటే ఉండలేనని చెప్పి ఇంటికి వెళ్ళాడు. అంతే ఆ తర్వాత ఉరికి వేలాడుతూ విగత జీవిగా మారాడు..
వివరాల్లొకి వెళితే.. ఈ అమానుష ఘటన విజయవాడలో వెలుగుచూసింది.విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. యువకుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తపేట కోమల విలాస్ ప్రాంతానికి చెందిన బెహర లక్ష్మీ, సోమేష్ దంపతులకు ఇద్దరు సంతానం. కొంత కాలంగా దంపతులు విడివిడిగా ఉంటున్నారు.కొన్ని నెలల క్రితం కార్తీక్ బుల్లెట్ కావాలని తల్లిని కోరగా.. బంగారు నాన్‌తాడు అమ్మి రూ.50 వేలు డౌన్ పేమెంట్‌గా కట్టి బుల్లెట్ కొనిచ్చింది. ఈఎంఐలు కట్టకపోవడంతో సన్నిహితులకు ఈ విషయం చెప్పి మనస్తాపంతో చనిపొయారు.. తల్లి ఫిర్యాధు మేరకు కేసు నమోదు చెసుకున్న పొలిసులు విచారణ చేపట్టారు..