పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి రూ. 46 లక్షలు దోచేసిన ఖి"లేడీ" ?

VAMSI
ఒకప్పటి మనిషి ఆలోచనకు ఇప్పటి మనిషి ఆలోచనలకూ చాలా తేడా ఉంది. రోజులు మారేకొంది టెక్నాలజీ మారుతుంది అనుకుంటే పొరపాటు పడినట్లే , టెక్నాలజీ తో పాటు మనుషులు వాళ్ళ ఆలోచలనలో కూడా చాలా తేడాలు వస్తున్నాయి. ఒక్కపుడు మనిషి మనిషిని బాగా నమ్మేవారు. కానీ ఇప్పుడు మనుషులలో ఎవర్ని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కానీ పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతే కాదు అసలు మనం ఎవరితో మాట్లాడుతున్నామో తెల్సుకొనే లోపే అవతలి వాళ్ళ చేతిలో మోసపోతున్నాము. ఇంత దారుణంగా తయారైయున్నారు మనుషులు. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే సైబర్ నేరగాళ్లు కూడా ఎక్కువగా ఉన్నారు. ఏదో ఒక టెక్నాలజీని వాడుకుని బ్యాంకు అకౌంట్స్ హాక్ చేయటం అందులో ఉన్న అమౌంట్ ను కచేయటం ఇదే పని గా పెట్టుకుని మరి దోచేస్తున్నారు.

మరి ఈ కోవకు చెందిన ఒక విషయం గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం.

ఆమె వయసు 25 సంవత్సరాలు , మరి అతనిది 50 సంవత్సరాలు, కాగా చిన్న వయసులో ఉన్న ఆ ప్రబుద్ధురాలు అతనిని నమ్మించి పక్కాగా అతని దగ్గర నుండి దాదాపు అక్షరాలా రూ.46 లక్షలు వరకు కాజేసింది. ఇక అసలు విషయానికి వచ్చినట్లైతే హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్‌లో నివాసం ఉంటున్న 50 ఏళ్లు పైబడిన వ్యక్తి ఒకరు తాను ఇతర కారణాల వలన రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే తరుణంలో తాను అనుకున్నదే తడువుగా మ్యాట్రిమోని సైట్‌లో తన ప్రొఫైల్‌ ను కూడా పోస్ట్ చేసారు. మరి ఈ తరుణంలో పక్కా ప్లాన్ ప్రకారం ఇది జరిగిన రెండో రోజుకు  ఒక అమ్మాయి డీపీతో ఉన్నటువంటి ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ అతనికి వచ్చింది. దీని గురించి పసిగట్టలేని అతను మాట్రిమోనీ వలనో లేక నార్మల్ గానో రిక్వెస్ట్ వచ్చి ఉంటుంది అనుకుని దానిని యాక్సెప్ట్ చేసాడు.

దానితో అవతలి నుండి మీరు నాకు నచ్చారు, నేను మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను అంటూ కబుర్లు చెప్పి తనని పూర్తిగా నమ్మించింది. ఆమెని నమ్మిన అతను ఇదంతా నిజమే అనుకుని ఆమెతో ఫేస్బుక్ లో మాట్లాడుతూ వచ్చాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత నేను ప్రస్తుతం ఇంజినీరింగ్‌ చదువుతున్నాను అని చెప్పి నాకు కాలేజీ ఫీజు కట్టాలని, కొన్ని సార్లు అలాగే  కొవిడ్‌ వచ్చిందని చాలా కష్టంగా ఉంది అన్నట్లు .. ఇలా పలు రకాలైన కారణాలు చెప్తూ అతని దగ్గర నుండి  చిన్న చిన్నగా మొత్తం రూ.46 లక్షలు లాగేసుకుంది. ఆ తర్వాత తనకు హ్యాండ్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఆమె నుండి ఎటువంటి సందేశం ఫోన్ రాకపోయే సరికి చాలా సార్లు ప్రయత్నించిన అతను  చివరికి తాను మోసపోయాను అని గ్రహించాడు. అప్పుడు ఆ బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం అంతా చెప్పుకున్నాడు. మరి బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: