కూతురు మాట వినడం లేదని.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
ఇలా నేటి రోజులలో జనాలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసి ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్న దుస్థితి ఏర్పడింది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. కుమార్తె చెప్పిన మాట వినడం లేదు అని ఆ తల్లి మనసు బాధ పడింది. దీంతో ఎంతగానో మనస్థాపం చెందింది. చివరికి ఇదే బాధతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఆ తల్లి. చివరికి కూతురుని తల్లి లేని దాన్ని చేసింది. ఈ విషాదకర ఘటన నారాయణగూడ వెలుగులోకి వచ్చింది. కాస్త వివరాల్లోకి వెళితే.. హైదర్గూడా ముత్యాల బాగ్ ఆర్టీసీ గెస్ట్ హౌస్ సమీపంలో నివస్తున్న దంపతుల కుమార్తె డిగ్రీ చదువుతుంది.
కొన్ని రోజులుగా తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా ఇక చదువు పక్కన పెట్టేసి స్నేహితులతో టైం పాస్ చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే కూతురు భవిష్యత్తు పాడవుతుందేమో అని భయంతో తల్లి పలుమార్లు కూతురు ను మందలించింది. అయినప్పటికీ కూతురు మాత్రం పట్టించుకోలేదు. దీంతో కూతురు తన మాట వినడం లేదని మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..