తల్లి అత్యాచారం.. పక్కనే ఉన్న కొడుకు?

praveen
మహిళల పై జరుగుతున్న అత్యాచార ఘటనలకు రోజుకు పెరిగి పోతున్నాయి తప్ప  ఎక్కడ తగ్గు ముఖం పడుతున్న దాఖలాలు మాత్రం అస్సలు కనిపించడం లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఆడపిల్ల ఒంటరిగా కనిపించింది ఉంటే చాలు అత్యాచారం  చేసే వారు మొన్నటి వరకు. కానీ ఇటీవల కాలం లో మాత్రం ఆడపిల్ల కుటుంబ సభ్యుల తో ఉన్నప్పటికీ రక్షణ లేకుండా పోయింది. ఏకంగా కుటుంబ సభ్యుల పై దాడి చేయడం దారుణం గా హత్యాచారాలు చేయడం లాంటి ఘటనలు ఎన్నో వెలుగు లోకి వస్తూనే ఉన్నాయి.


 మహిళలకు రక్షణ కల్పించేందుకు  ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధులు తీరులో  మాత్రం మార్పు రావడం లేదు అని చెప్పాలి. దీంతో ఈ సృష్టికి మూలమైన ఆడపిల్ల ప్రస్తుతం కామాంధులు ఎక్కడ ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తారో అని ప్రతిక్షణం బాధపడుతూ బతకే పరిస్థితి ఏర్పడింది. ఇక కామందుల కోరల్లో చిక్కు కోకుండా ఉండేందుకు మహిళలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధం గా మహిళల పై అత్యాచారాలు జరుగుతున్నాయి అన్న విషయం తెలుస్తుంది. ఇక దేశం లో ఎక్కడో ఓ చోట ప్రతిరోజు ఆడ పిల్లల పై అత్యాచారం  జరిగిన ఘటనలు వెలుగు లోకి వస్తూనే ఉన్నాయ్.



 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని పల్నాడు జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన వెలుగు చూసింది. గురజాల లో ఓ మహిళ పై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిన్న రాత్రి సమయం లో మరో గ్రామానికి వెళ్లేందుకు రైల్వేస్టేషన్ లో చిక్కుకున్న బాధితురాలిని ఎత్తుకెళ్లిన దుండగులు ఇక ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఉదయం  స్థానికులు ఆమెను చూసి ఆస్పత్రికి తరలించారు. పక్కనే 2ఏళ్ళ కుమారుడు తల్లిని చూసి ఏడుస్తూ ఉండడం అందరికీ మనసును కదిలించింది. తనది ఒడిషా అని చెబుతుంది ఆ మహిళ భాష పూర్తిగా అర్థం కావడం లేదని చెబుతున్నారు వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: