మెట్ల మీద నుంచి పడి బాలిక మృతి.. కానీ పోస్టుమార్టంలో షాకింగ్ నిజం?

praveen
జన్మనిచ్చి ఇక అల్లారుముద్దుగా కని పెంచిన తల్లిదండ్రులే పెద్దయ్యాక యమకింకరులు గా మారి పోతే.. ఎలాంటి కష్టం వచ్చినా తీర్చాల్సిన తల్లిదండ్రులే చివరికి ఒక వయస్సు వచ్చిన తర్వాత పగవారిగా మారి పోతే.. కంటికి రెప్పలా కాచుకోవాల్సిన తల్లిదండ్రులే చివరికి కాటికి పంపేందుకు కూడా సిద్ధమైతే.. ఊరుకోండి బాసు తల్లిదండ్రులు పిల్లల విషయంలో అలా ఎందుకు ఆలోచిస్తారు అని అనుకుంటున్నారు కదా.. కానీ ఇటీవల కాలంలో ఎంతోమంది  రక్తం పంచుకుని పుట్టిన పిల్లల కంటే పరువు ప్రతిష్ఠలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో పరువు కోసం చేస్తున్న హత్యలు రోజురోజుకి పెరిగిపోతు ఉన్నాయని చెప్పాలి.


 ఇటీవలే హర్యానాలో ఇలాంటి ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని సోనిపట్ లో ఏకంగా పరువు కోసం తండ్రి మైనర్ కూతురిని దారుణంగా గొంతు నులిమి  చంపేశాడు. ఘటన స్థానికులు అందరినీ ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసింది. అయితే మైనర్ బాలికను చంపేసి ఇక మెట్ల మీద నుంచి పడి మృతి చెందింది అంటూ కొత్త నాటకానికి తెర లేపాడు. తండ్రి చెప్పింది నమ్మి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు లో అసలు నిజాలు బయటపడటంతో ఇక నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.


 అయితే మొదట మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఏం జరిగిందని ఆరాతీస్తే  మెట్ల మీద నుంచి పడిపోయిందని  కుటుంబ సభ్యులు చెప్పారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.. పోస్టుమార్టం రిపోర్టులో గొంతునులిమి హత్య చేసినట్లు తేలింది. ఇక ఆ తరువాత తండ్రిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. బాలికకు అదే గ్రామంలోని అబ్బాయితో సంబంధం ఉందని.. ఈ విషయం తెలియడంతో కూతురు గొంతు నులిమి హత్య చేశాడు అనే విషయాన్ని ఒప్పుకున్నాడు. మృతురాలి తండ్రినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: