చనిపోయాడని పూడ్చేశారు.. కానీ 24 గంటల్లో ఇంటికొచ్చాడు?
ఈ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. ఈరోడ్ సమీపంలోని అనగల పూర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. మూర్తి అనే దినసరి కూలీ చెరుకు తోట లో పని చేస్తూ ఉంటాడు. ఇలా చెరుకుతోటలో పనిచేసేందుకు కొద్ది రోజుల క్రితమే తీర్పుర్ వెళ్ళాడు. అయితే ఆదివారం ఉదయం మూర్తి చనిపోయాడు అంటూ అతని కుమారుడు కార్తీ కీ సమాచారం అందింది. ఈ క్రమంలోనే ఇక వెంటనే తీర్పుర్ వెళ్లిన కార్తీ చనిపోయింది తన తండ్రి అని నిర్ధారించుకొన్నాడు. ఈ క్రమంలోనే సాంప్రదాయాల ప్రకారం అతని తండ్రి అంత్యక్రియలు నిర్వహించి మృతదేహాన్ని రాత్రి సమయంలో పూడ్చి పెట్టాడు.
ఇక ఆ తర్వాత అందరూ తిరిగి ఇంటికి వచ్చేశారు. ఇక మరునాడు ఉదయం ఊహించని ఘటన చోటుచేసుకుంది. చనిపోయాడు అని భూమిలో పూడ్చి పెట్టిన మూర్తి ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే ఇక ఇలా మూర్తి ఒక్కసారిగా ఇంటికి రావడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. ఇది ఎలా సాధ్యం అయింది అని ఎవ్వరికీ అర్ధం కాలేదు. అయితే మూర్తి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు అని సంతోషపడాలా లేకపోతే పూడ్చి పెట్టిన తర్వాత ఎలా తిరిగి వచ్చాడు అసలు ఇది ఎలా సాధ్యమైంది అని షాక్ అవ్వాలా అని కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు..