షాకింగ్ ఘటన.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా?

praveen
మృత్యువు ఎప్పుడు ఎటువైపు నుంచి దూసుకువచ్చి ప్రాణాలు పోతాయో అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది. ఇక కొన్ని కొన్ని ఘటనలు చూసిన తర్వాత దేవుడి చేతిలో మనుషుల జీవితాలు కీలు బొమ్మ లాంటిదే అని ప్రతి ఒక్కరూ నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఎంతో సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఎవరు ఊహించని ఘటన లు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి అని చెప్పాలి.  ప్రస్తుత  సమయంలో కనిపించని శత్రువు కరోనా వైరస్ తో ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తున్నారు. అనుక్షణం ప్రాణాలను రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా భయం భయంగానే బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదే సమయంలో మరి కొన్ని ఘటనలు ఊహించని విధంగా ప్రాణాలను తీస్తున్నాయ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇటీవలే కూకట్పల్లి లో కూడా ఇలాంటి ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి కూతురు కలిసి ఎంతో సంతోషంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ వారి సంతోషాన్ని చూసి వీధి ఓర్వ లేక పోయింది. ఈ క్రమంలోనే అనుకోని ప్రమాదాన్ని తీసుకు వచ్చి చివరికి ఆ చిన్నారి ప్రాణాలు తీసింది. కళ్ళముందు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు చనిపోవడంతో ఆ తల్లి గుండె ఒక్కసారిగా బద్దలయింది. దీంతో అరణ్యరోదనగా విలపించింది. శాతవాహన నగర్ లో నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ గోడకూలి చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.


 ఉదయం సమయంలో ఓ తల్లి తన కూతురు షరోన్ విద్య తో కలిసి రోడ్డుపై వెళుతూ ఉంది. అదే దారిలో ఒక ట్యాంకు గోడ నిర్మాణం జరుగుతోంది. ఇక ఒక్కసారిగా ఆ శిథిలాలు కూలీ చిన్నారి మీద పడ్డాయి. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అయితే అప్పుడు వరకు నవ్వుతూ తన కళ్ళ ముందే ఉన్న కూతురు అంతలోనే విగతజీవిగా మారిపోవడంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. సమాచారం అందడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: