ఆటో డ్రైవర్ కామం.. ఎంత నీచానికి ఒడిగట్టాడు?

praveen
దేశంలో ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట ఆడపిల్ల జీవితం బలి అవుతూనే ఉంది. కామపు కోరల్లో చిక్కుకోకుండా  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా మానవ మృగాలు కాస్త సమయం సందర్భం చూసి ఇక ఆడపిల్లలపై అత్యాచారం పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలు మగాళ్ళ లో ఉన్న మృగాలు బయటకు వస్తూ పశువుల్లా మీద పడి అత్యాచారం చేస్తూ ఉన్నారు. దీంతో ఇక ఆడపిల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లింది అంటే చాలు మళ్లీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందా లేదా అని ప్రతి ఒక్కరూ అనుక్షణం భయపడే పరిస్థితి ఏర్పడింది.

 నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న అత్యాచార ఘటనలు ప్రతి ఆడపిల్ల తండ్రికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి అని చెప్పాలి. ఇటీవలే మేడ్చల్ జిల్లా లో 11 ఏళ్ల బాలికపై ఒక ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది. ఇక ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 31వ తేదీన బాధిత బాలిక తన స్నేహితులతో కలిసి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంది. బాలికకు పరిచయం ఉన్న ఒక ఆటో డ్రైవర్ కేవలం ఆమెను మాత్రమే ఆటోలో ఎక్కించుకున్నాడు.

 ఆ తర్వాత రోజు బాలిక స్నేహితులు ఈ విషయాన్ని క్లాస్ టీచర్ కి చెప్పారు. దీంతో బాలిక ను పిలిపించి ఏం జరిగింది అని అడగడంతో అసలు విషయం బయట పెట్టింది బాలిక. ఆటో డ్రైవర్ వెంకటయ్య తన మీద అత్యాచారం చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే  బాలిక తల్లిదండ్రులకు స్కూల్ టీచర్  ఫోన్ చేసి విషయం చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించింది. పరువు పోతుందని కారణంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు వరకు వెళ్ళలేదు. స్కూల్ టీచర్ మళ్ళీ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి ఇక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: