భార్యను చంపేందుకు సుపారీ ఇచ్చిన భర్త.. కానీ చివరికి?

praveen
భార్య భర్తల బంధం ఎంతో అన్యోన్యంగా ఉండాలి అంటే ఇద్దరికీ కూడా ఒకరిపై ఒకరికి ఎంతో నమ్మకం ఉండాలి. ఇలా నమ్మకం ఉన్నప్పుడే సంసారం సాఫీగా సాగి పోతూ ఉంటుంది. కానీ భార్య భర్తల బంధం లోకి అనుమానం పెనుభూతం దూరింది అంటే ఇక ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ భార్యను అనుమానించడం మొదలు పెట్టిన భర్త పలుసార్లు ప్లాన్ చేసి మరి భార్యను హత్య చేయాలని అనుకున్నాడు. చివరికి హత్యాయత్నం విఫలం కావడంతో స్నేహితుడికి సుపారీ ఇచ్చి మరీ భార్యను హత్య చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.


 మహిళపై హత్యాయత్నం జరిగిన కేసులో ఇటీవలే పోలీసులు పురోగతి సాధించారు. సదరు మహిళను చంపాలి అనుకున్నది  ఎవరో కాదు భర్తే అని పోలీసులు తేల్చారు.  నిందితుడు ఏకంగా జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్న ఒక వ్యక్తి కీ సుపారీ ఇచ్చి మరీ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. మార్చి 30వ తేదీన భరత్ నగర్ కాలనీ లో మహేశ్వరి నగర్ లో ఉంటున్న స్పందన ను గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేసేందుకు ప్రయత్నించారు.


 అదే సమయంలో ఇంట్లో ఉన్న భర్త తన ఏడాదిన్నర కూతుర్ని తీసుకుని వరండా లోకి వెళ్ళాడు. అప్పుడే ఆగంతకుడి ఇంట్లోకి ప్రవేశించి కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలోనే  క్షతగాత్రురాలిని ఆసుపత్రికి తరలించగా ఆమె కోలుకుంది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సి సి ఫుటేజ్ పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్పందన  తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉన్న కారణంగానే వేణుగోపాల్ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే హత్య చేయాలని ప్లాన్ చేసి యూసఫ్ గూడా లో ఉండే మిత్రుడు జూనియర్ ఆర్టిస్ట్ తిరుపతికి సుపారీ ఇచ్చి ప్లాన్  ప్రకారమే ఇక హత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఇక విచారణలో అన్ని నిజాలు బయట పడడంతో భర్త వేణుగోపాల్ తో పాటు హత్యాయత్నం  చేసిన నిందితుడు తిరుపతిని కూడా అరెస్టు చేశారు పోలీసులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: