ఆత్మహత్య చేసుకునేందుకు రైలు కింద పడ్డాడు.. కానీ ఎలా బతికాడో తెలుసా?
క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగానే ముగిస్తున్నారు ఎంతోమంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది . పాపం ఆ యువకుడికి ఏం కష్టమొచ్చిందో ఏమో ఎన్నో రోజుల పాటు మనస్థాపంతో కుంగిపోయాడు. ఆ తర్వాత జీవితం వృధా అని అనుకొని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలి అని భావించాడు. ఇలా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన చేస్తే రైలు కింద పడి ఆత్మహత్య చేసి కేవలం క్షణాల్లో ప్రాణాలు పోతాయి అని నిర్ణయించుకున్నాడు. చివరికి ఎంతో ధైర్యం చేసి ఇక రైలు కింద పడ్డాడు.
కానీ అతనిలో ఉన్న ప్రాణ భయమే చివరికి అతని ప్రాణాలతో బయట పడేలా చేసింది. ఈ ఘటన విశాఖ రైల్వేస్టేషన్లో వెలుగులోకి వచ్చింది. నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ పై రైలు వస్తున్న సమయంలో ఓ యువకుడు అకస్మాత్తుగా రైలు పట్టాల పైకి వెళ్ళాడు. ముందు నుంచి రైలు దూసుకొస్తోంది. కానీ అంతలో అతనికి ఆత్మహత్య చేసుకునేందుకు దైర్యం సరిపోలేదు. దీంతో రైలు పట్టాల మధ్య బిక్కుబిక్కుమంటూ పడుకుండిపోయాడు. ఇక రైలు వెళ్లే వరకు కూడా కదలకుండా రెండు పట్టాల మధ్య ఉండటంతో ఎలాంటి గాయాలు కాకుండానే బయటపడ్డాడు. అయితే ఇది గమనించి ప్రయాణికులు కేకలు వేయడంతో అప్రమత్తమైన ఆర్పిఎఫ్ సిబ్బంది అతన్ని రక్షించి అదుపులోకి తీసుకున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు..