వామ్మో ఇదేం దుస్థితి.. ఐసీయూలో రోగిని కొరికిన ఎలుకలు?
ఐ సి యూ లో ఇలాంటి తరహా ఘటన జరగడం పై మాత్రం ప్రస్తుతం బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీయూలో చికిత్స పొందే పేషెంట్ పరిస్థితే ఇలా ఉంటే ఇక ఆసుపత్రిలో మిగతా వార్డులో ఉన్న పేషంట్ ల పరిస్థితి ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. హనుమకొండ భీమవరానికి చెందిన శ్రీనివాస్ గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు సదరు వ్యక్తి. ఇక ఇటీవల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువచ్చారు.
ఈ క్రమంలోనే అతన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మొదటి రోజు అతనికి చేదు అనుభవం ఎదురైంది. తొలి రోజే అతని చేతి వేళ్లను ఎలుకలు కొరికాయ్. ఈ విషయం కుటుంబ సభ్యులు చెప్పడంతో ఇక గాయాలకు కట్టు కట్టారు. ఆ తర్వాత మరునాడు ఉదయం శ్రీనివాస్ పై ఎలుకల దాడి చేయడంతో పాటు కాలివేళ్లను కొరకడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఇక స్పందించిన వైద్యులు మళ్ళీ కట్టుకట్టి చికిత్స అందించారు. అయితే ఈ ఘటనపై మాత్రం అటు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని ఆసుపత్రి ఆర్ఎంవో దృష్టికి తీసుకెళ్లగా ఇక ఎలుకల నివారణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఆయన..