ఆ నెంబర్స్ నుంచి వీడియో కాల్..లిఫ్ట్ చేస్తె ఖతం..

Satvika
ఈ మధ్య సైబర్ నేరస్తుల ఆగడాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈజి మనీ కోసం కొత్త కొత్త టెక్నాలజీని వాడుతున్నారు.. అలా తెలియని వాళ్ళను కాల్స్, లేదా మెసేజ్ లు చేస్తున్నారు.. అలా వారి నుంచి వారికి తెలియకుండానే డబ్బులను హరించి వేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. రోజుకు వేల మంది ఇలాంటి వారి వల్ల బాధితులుగా మారుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. కొత్తగా వాట్సాప్‌ లో కొన్ని తెలియని నెంబర్స్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆ నెంబర్స్ ను ఎత్తితే మాత్రం ఇక మన పని అయినట్లే..


నార్సింగికి చెందిన వ్యక్తికి గుర్తు తెలియని నంబర్‌ నుంచి వాట్సాప్‌ వీడియో కాల్‌ వచ్చింది. కాల్‌ లిఫ్ట్‌ చేయగానే అటువైపు స్క్రీన్‌పై ఎలాంటి వాయిస్ కానీ, వీడియో కానీ కనిపించలేదు. అయితే కొంత సేపు వాళ్ళు చూసిన తరువాత అసలు విషయం బయటకు వచ్చింది. తెర బ్లాక్‌గా కనిపించింది. కాల్‌ కట్‌ అయిన కొన్ని నిమిషాల తర్వాత.. తనకొచ్చిన మెసేజ్‌ చూసి బాధితుడు షాకయ్యాడు.. అతను ఆ విషయం నుంచి తేరుకొనే లోపు అతని వీడియోను మార్ఫింగ్ చేసి వెంటనే న్యూడ్ ఫోటోలను, వీడియో లను పంపించారు. అతను అడిగిన అంత డబ్బులను పంపించాలని లేకుంటే ఆ వీడియో లను బంధువులకు పంపిస్తానని బెదిరించారు.


స్నేహితులు, బంధువులకు పంపిస్తామని సైబర్‌ నేరస్తులు బెదిరించారు. దీంతో ఏం చేయాలో తోచని బాధితుడు మొదట రూ.5 వేలు ఆన్‌లైన్‌లో చెల్లించి, దాని స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేశాడు. మరోసారి ఫోన్‌ చేసిన నిందితులు రూ.30 వేలు డిమాండ్‌ చేశారు. భయపడిపోయిన బాధితుడు మళ్లీ సమర్పించుకున్నాడు. ఈసారికి రూ.20 వేలు పంపించాలని బెదిరించడంతో అలానే పంపించాడు..ఆ    తర్వాత కూడా అతని ఆగడాలు ఎక్కువ కావడంతో భాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఈ తతంగమంతా సైబర్‌ నేరస్తులు రికార్డ్‌ చేస్తారు. ఆ తర్వాత కొద్ది సేపటికి బాధితుడికి ఫోన్‌ చేసి తన న్యూడ్‌ వీడియోను పంపించి, బ్లాక్‌ మెయిల్‌ చేస్తారు.. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసి అసలు విషయాన్ని బయట పెట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: