ఒక పొరపాటు ఆమె జీవితాన్నే మార్చేసిందా?
భార్యభర్తలు ఇద్దరూ ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు. కొత్తగా ఆమె భర్త ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాడు.. అతను వెంటనే భార్యకి ఫాలో రిక్వెస్ట్ పంపడంతో ఆమె ఒకే చేసింది.. ఆపై భర్తతో అలానే మెసేజ్ లు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో అతను తన న్యూద్ ఫోటోలను పంపమని కోరడంతో పంపింది. అలా మూడు నెలలు గడిచాయి.కాగా, ఓ రోజు పనిగా ఫొటోలు పంపాలంటూ భర్త నుంచి ఒత్తిడి వచ్చింది.. ఆమె పంపను అని చెప్పింది. దాంతో అతను ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించాడు..
ఇకపోతే సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తను ఈ విషయమై నిలదీయడంతో.. అసలు విషయం తెలుసుకొని షాక్ అయ్యింది.. ఈ విషయాన్ని భర్తకు చెప్పడంతో ,ఇద్దరు కలిసి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు..కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలో కి దిగారు. ఐపీ అడ్రస్ ఆధారంగా పక్క ఫ్లాట్‌లో ఉంటున్న 20 ఏళ్ల యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. తన భర్త పేరుతో అకౌంట్ ను క్రియేట్ చేసి ఆమెను కావాలని ట్రాప్ చేశాడు.. దీంతో అతణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫోటోలను డిలీట్ చేసి ఫోన్ ను స్వాదీనం చేసుకున్నారు.. వారిద్దరి మధ్య వున్న గొడవల కారణంగా అతను ఇలా చేశాడని తెలుస్తుంది.