భార్యపై అత్యాచారయత్నం.. అడ్డుకున్న భర్తని అక్కడ కొరికేసాడు?

praveen
ఇటీవలి కాలంలో మానవత్వమున్న మనుషులు కాస్త మానవమృగాలు గా మారిపోతు న్నారు. ఈ క్రమంలోనే మహిళలపై దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు ఎన్నికల చట్టాలు తీసుకొచ్చినా ఎక్కడ మార్పు మాత్రం కనిపించడం లేదు అని చెప్పాలి. ఆడపిల్ల కనిపిస్తే చాలు తాము కూడా మనుషులమే అన్న విషయాలను మర్చిపోయి దారుణంగా ప్రవర్తిస్తున్నారు.

 ఒకప్పుడు ఆడపిల్లల పక్కన ఎవరైనా కుటుంబ సభ్యులు ఉంటే వారి జోలికి వెళ్లడానికి భయపడేవారు. కేవలం ఒంటరిగా ఉన్న ఆడపిల్లలపై మాత్రమే అత్యాచారాలు చేసేవారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం కుటుంబ సభ్యులు పక్కన ఉన్న వారిపై దాడి చేసి మరి అత్యాచారాలు చేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం లోని కొండాపురానికి చెందిన విఆర్ఏ అశోక్ ఓ మహిళపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఇక ఇది గమనించిన బాధిత మహిళ భర్త అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఏకంగా అతని ఎడమ చేయి చిటికెన వేలును కొరికేసాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది.

 మండలంలోని కొండాపురం శివారు తండాకు చెందిన బాధిత కుటుంబ సభ్యులు బిర్యాని సెంటర్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొండాపూర్ గ్రామానికి చెందిన వీఆర్ఏ అశోక్ బిర్యాని సెంటర్ నిర్వాహకురాలిపై  అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. అయితే భయాందోళనకు గురైన మహిళ కేకలు వేయడంతో భర్త కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే బాధిత మహిళ భర్త ఎడమ చేయి చిటికిన వేలు నిందితుడి నోట్లో పడటంతో ఇక ఏకంగా చేయి నుంచి వేలు తెగి పోయేంతవరకు దారుణంగా కొరికాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే బాధిత కుటుంబ సభ్యులు వెంటనే పోలీస్ స్టేషన్కు చేరుకునీ సమాచారం అందించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: